Bheemla Nayak 13 days Collections: పవన్‌కు వరుస షాక్‌లు.. టార్గెట్ కాదు.. ఆ రికార్డు కూడా కష్టమే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి వాటిలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించిన 'భీమ్లా నాయక్' ఒకటి. భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకుని.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఆరంభంలోనే ఇది కలెక్షన్లను అత్యధికంగా రాబట్టుకుంది.

Recommended Video

Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu

అయితే, రోజులు గడుస్తోన్న కొద్దీ దీనికి వసూళ్లు అంతగా రావడం లేదు. ఈ క్రమంలోనే 13వ రోజు కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 13 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత రాబట్టాలి? అనే విషయాలు చూద్దాం పదండి!

క్రేజీ కాంబోలో ‘భీమ్లా నాయక్'

క్రేజీ కాంబోలో ‘భీమ్లా నాయక్'

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రీవేంజ్ డ్రామాగా రూపొందిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. విలక్షణ దర్శకుడు సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు. థమన్ సంగీతం అందించాడు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

13వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

13వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

13వ రోజు ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 13వ రోజు దీనికి రూ. 18 లక్షలు షేర్‌‌తో పాటు రూ. 32 లక్షలు గ్రాస్ వచ్చింది.

13 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

13 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో ‘భీమ్లా నాయక్' మంచిగా వసూలు చేసింది. ఫలితంగా నైజాంలో రూ. 34.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.51 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.43 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.94 కోట్లు, గుంటూరులో రూ. 5.18 కోట్లు, కృష్ణాలో రూ. 3.75 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో కలిపి రూ. 74.92 కోట్లు షేర్, రూ. 114.42 కోట్లు గ్రాస్‌ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 74.92 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ చప్పబడింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.46 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 13 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.58 కోట్లు షేర్‌తో పాటు రూ. 155.55 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో రూ. 95.58 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.42 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఆ రికార్డు కూడా కష్టమే అంటూ

ఆ రికార్డు కూడా కష్టమే అంటూ

పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో పాటు టార్గెట్‌ను కూడా చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, కొన్ని రోజులుగా కలెక్షన్లు చప్పబడ్డాయి. దీనికితోడు రాధే శ్యామ్ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో పవన్ వంద కోట్ల కల నెరవేరేలా కనిపించడంలేదని ట్రేడ్ వర్గాల టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X