Bheemla Nayak 15 Days Collections: 15వ రోజు దారుణమైన వసూళ్లు.. తొలిసారి ఆ మార్కును కూడా దాటకుండానే!
టాలీవుడ్ బడా హీరోలుగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా రూపొందింది. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో దీనిపై విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీంతో ఈ చిత్రానికి మొదటి వారం కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, రెండో వారం చాలా దారుణంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి మూడో వారం ప్రారంభమైంది. మరి ఇది 15 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దామా?

బిగ్ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో ప్రతీకార కథతో రూపొందిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

15వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
‘భీమ్లా నాయక్'కు 15వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు మరింతగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 3 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 30 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 50 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో.. 15వ రోజు దీనికి రూ. 8 లక్షలు షేర్‌తో పాటు రూ. 13 లక్షలు గ్రాస్ వచ్చింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో ‘భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.01 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.54 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.45 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.95 కోట్లు, గుంటూరులో రూ. 5.20 కోట్లు, కృష్ణాలో రూ. 3.77 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో కలిపి రూ. 75.10 కోట్లు షేర్, రూ. 114.73 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 75.10 కోట్లు వసూలు చేసిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.48 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 15 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.79 కోట్లు షేర్‌తో పాటు రూ. 155.91 కోట్ల గ్రాస్ వచ్చింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 15 రోజుల్లో రూ. 95.79 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.21 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











