Bheemla Nayak 16 Days Collections: పవన్‌కు కలిసొచ్చిన శనివారం.. ఇంకా హిట్‌కు అన్ని కోట్ల దూరంలోనే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అన్ని జోనర్లలో ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో కంటే ఇప్పుడు మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా రూపొందుతోన్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ భారీ స్థాయిలో దక్కుతోంది. దీంతో హీరోలు, దర్శక నిర్మాతలు రెట్టించిన ఉత్సాహంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలయికలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఆరంభంలో బాగానే రాణించినా క్రమంగా కలెక్షన్లు డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్'

రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్'

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో రివేంజ్ డ్రమాగా రూపొందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం అందించాడు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ సమాచారం.

16వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

16వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

16వ రోజు 'భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు కొంత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 16వ రోజు దీనికి రూ. 25 లక్షలు షేర్‌‌తో పాటు రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

16 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 'భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.57 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.47 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.96 కోట్లు, గుంటూరులో రూ. 5.21 కోట్లు, కృష్ణాలో రూ. 3.78 కోట్లు, నెల్లూరులో రూ. 2.54 కోట్లతో కలిపి రూ. 75.35 కోట్లు షేర్, రూ. 115.25 కోట్లు గ్రాస్‌ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 75.35 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 16 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 96.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 156.41 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లో రూ. 96.07 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 11.93 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X