twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak 17 Days Collections: ఆదివారం అనూహ్యమైన వసూళ్లు.. హిట్ ఏమో కానీ.. ఆ రికార్డు కష్టమే!

    |

    సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార పవన్ కల్యాణ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగానే గత ఏడాది ఈ స్టార్ హీరో 'వకీల్ సాబ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను మరింత జోష్‌తో పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దగ్గుబాటి రానాతో కలిసి 'భీమ్లా నాయక్' అనే సినిమాలో నటించాడు.

    ఈ సినిమా ఫిబ్రవరి 25నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఆరంభంలో కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, వసూళ్లు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఆదివారం కలెక్షన్లు కాస్త పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    బిగ్ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'

    బిగ్ మల్టీస్టారర్‌గా ‘భీమ్లా నాయక్'

    పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో వచ్చిన బిగ్ మల్టీస్టారర్ మూవీనే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం సమకూర్చాడు.

    బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!బట్టలు లేకుండా యాంకర్ విష్ణుప్రియ రచ్చ: హాట్ షోలో హద్దు దాటి మరీ దారుణంగా!

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    రీవేంజ్ డ్రామాగా వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    17వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    17వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    ‘భీమ్లా నాయక్'కు 17వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు కొంత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 80 వేలు, వెస్ట్‌లో రూ. 5.20 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 17వ రోజు దీనికి రూ. 36 లక్షలు షేర్‌‌తో పాటు రూ. 60 లక్షలు గ్రాస్ వచ్చింది.

    కాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారికాజల్‌ పర్సనల్ ఫొటో షేర్ చేసిన భర్త: ప్రెగ్నెంట్ అయ్యాక ఇలా కనిపించడం ఇదే తొలిసారి

    17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    17 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో ‘భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.62 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.47 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.02 కోట్లు, గుంటూరులో రూ. 5.24 కోట్లు, కృష్ణాలో రూ. 4.20 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.33 కోట్లు షేర్, రూ. 115.85 కోట్లు గ్రాస్‌ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఆంధ్రా, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 76.33 కోట్లు వసూలు చేసిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.51 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 17 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 158.16 కోట్ల గ్రాస్ వచ్చింది.

    బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

    Recommended Video

    Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    మల్టీస్టారర్‌గా ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 17 రోజుల్లో రూ. 97.07 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 10.93 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie Collects Rs 97.07 Cr in 17 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X