twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak 18 Days Collections: ఆ దెబ్బ గట్టిగానే పడింది.. నష్టాల బాటలోనే భీమ్లా..?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ను బాగానే అందుకుంది. కానీ ఆ తర్వాత మెల్ల మెల్లగా సినిమా వసూళ్లు తగ్గుతూ వస్తూ ఉండటంతో చాలా ఏరియాలలో నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఈ సినిమా పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపించాయి.

    టికెట్లే రేట్లు తక్కువగా ఉండడం అదనపు షోలు లేకపోవడం ఎఫెక్ట్ చూపించింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఎదుర్కొంటున్న నష్టాలు ఒక విధంగా ఏపీ మార్కెట్ వల్లనే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా 18 రోజులలో ఎంత వసూళ్లను అందుకుంది. ఇంకా హిట్ అవ్వాలి అంటే ఎంత వసూళ్లను రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

    పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే..

    పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే..

    ఫిబ్రవరి 25వ తేదీన వచ్చిన భీమ్లా నాయక్ మొత్తానికి అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే విడుదల అయింది బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా మంచిగానే వచ్చాయి. దానికి తోడు పాజిటివ్ రివ్యూలు అభిమానుల హంగామా ఇలా అన్ని విధాలుగా భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్స్ అందుకోవడానికి ఉపయోగపడ్డాయి. రానా దగ్గుబాటి లాంటి పవర్ఫుల్ హీరో మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించడం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

    ఎంత బిజినెస్ చేసిందంటే..

    ఎంత బిజినెస్ చేసిందంటే..

    ఇక ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. మలయాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన భీమ్లా నాయక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడయ్యింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసినట్లు సమాచారం.

    18వ రోజు వచ్చిన వసూళ్ళు..

    18వ రోజు వచ్చిన వసూళ్ళు..

    ‘భీమ్లా నాయక్'కు 18వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఆదివారం కంటే ఒక్కసారిగా సగానికి పడిపోయాయు. ఆంధ్ర ఏరియాలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో పాటు ఆదనపు షోలకు అనుమతులు ఇవ్వక పోవడం వలన దెబ్బ గట్టిగానే పడింది. ఫైనల్ గా సినిమా 18వ రోజు టోటల్ 13 లక్షల షేర్ సాదించింది.

    18 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

    18 రోజుల్లో ఏపీ తెలంగాణ కలెక్షన్స్

    తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో ‘భీమ్లా నాయక్' వసూళ్లు మళ్ళీ డౌన్ అయ్యాయి. దీంతో నైజాంలో రూ. 34.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.63 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.48 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.04 కోట్లు, గుంటూరులో రూ. 5.25 కోట్లు, కృష్ణాలో రూ. 4.21 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.46 కోట్లు షేర్, రూ. 115.85 కోట్లు గ్రాస్‌ దక్కింది.

    వరల్డ్ వైడ్ ఎంతంటే..

    వరల్డ్ వైడ్ ఎంతంటే..

    18 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ. 76.46 కోట్లు వసూలు చేసిన ‘భీమ్లా నాయక్' కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.52 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా టోటల్ గా 18 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 97.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 158.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

    Recommended Video

    Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
    హిట్ అవ్వాలి అంటే..

    హిట్ అవ్వాలి అంటే..

    ‘భీమ్లా నాయక్'కు వరల్డ్ వైడ్ గా రూ. 106.75 కోట్ల వరకు బిజినెస్ చేసింది. రానా పవర్ స్టార్ కాంబో కావడంతో బయ్యర్లు సినిమాను ఎగబడి కొనుగోలు సీబీశారు. రూ. 108 కోట్లుగా బ్రేక్ ఈవెన్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా 17 రోజుల్లో రూ. 97.21 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 10.79 కోట్లు వసూలు చేస్తేనే హిట్ అయినట్లు లెక్క.

    English summary
    Pawan Kalyan' Bheemla Nayak Movie 18 Days world wide Box Office Collections Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X