Bheemla Nayak 1st Week Collections: 7వ రోజు భారీ షాక్.. మొదటి వారం అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం గతంతో పోలిస్తే ఇప్పటి సినీ ప్రియుల అభిరుచిలో మార్పులు రావడమే. అందుకే ఇలాంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీంతో హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చినా.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మొదటి వారం రిపోర్టును చూద్దాం పదండి!

స్టార్ హీరోల కాంబోలో వచ్చేసింది
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రివేంజ్ డ్రామాగా వచ్చిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు ఇచ్చాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
ఇద్దరు స్టార్ల కలయికలో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఏడో రోజు ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి గురువారం రూ. 98 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

మొదటి వారం ఎంత వచ్చింది?
మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్' బాగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.63 కోట్లు, గుంటూరులో రూ. 4.82 కోట్లు, కృష్ణాలో రూ. 3.38 కోట్లు, నెల్లూరులో రూ. 2.33 కోట్లతో కలిపి రూ. 70.40 కోట్లు షేర్, రూ. 106.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఫస్ట్ వీక్ ఆంధ్రా, తెలంగాణలో రూ. 70.40 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా వారం రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 89.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 146 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 89.60 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 18.40 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
Recommended Video

ఏడో రోజు భారీ షాక్.. తొలిసారి ఇలా
పవన్ - రానా కాంబోలో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయల కంటే తక్కువే అంటే రూ. 98 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో విడుదలైన తర్వాత తొలిసారి కోటి కంటే తక్కువకు పడిపోయాయి.


Click it and Unblock the Notifications











