twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak 2 Weeks Collections: పవన్‌ మూవీకి భారీ షాక్.. అఖండ, పుష్పను టచ్ చేయని భీమ్లా నాయక్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. దీనికి కారణం ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో పాటు హీరోలు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తుండడమే. దీన్నే అదునుగా చేసుకుని దర్శక నిర్మాతలు వరుస పెట్టి అలాంటి సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో ఇలా వచ్చిన చిత్రమే 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ మూవీ.. భారీ అంచనాలతో రెండు వారాల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలో భారీ కలెక్షన్లను రాబట్టినా.. క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. మరి ఈ సినిమా రెండు వారాల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది? అవేవి చూద్దాం పదండి!

    Recommended Video

    Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
    రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్’

    రివేంజ్ డ్రామాగా ‘భీమ్లా నాయక్’

    పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో రీవేంజ్ డ్రామాగా రూపొందిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం ఇచ్చిన ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

    Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్Bigg Boss Non Stop: సరయు రాయ్‌పై చెక్కతో దాడి.. ఆరియానా తప్పుకు ఆమె బలి.. బిగ్ బాస్ వార్నింగ్

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

    ఇద్దరు హీరోల కలయికలో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    14వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    14వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

    ‘భీమ్లా నాయక్'కు 14వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 2 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 70 వేలు, నెల్లూరులో రూ. 30 వేలతో.. 14వ రోజు దీనికి రూ. 10 లక్షలు షేర్‌‌తో పాటు రూ. 18 లక్షలు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

    14 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    14 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

    తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో ‘భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.53 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.44 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.95 కోట్లు, గుంటూరులో రూ. 5.19 కోట్లు, కృష్ణాలో రూ. 3.76 కోట్లు, నెల్లూరులో రూ. 2.53 కోట్లతో కలిపి రూ. 75.02 కోట్లు షేర్, రూ. 114.60 కోట్లు గ్రాస్‌ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ఏపీ, తెలంగాణలో రెండు వారాల్లో రూ. 75.02 కోట్లు వసూలు చేసిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ అంతగా రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.47 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 14 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 155.75 కోట్ల గ్రాస్ వచ్చింది.

    హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు వారాల్లో రూ. 95.70 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 12.30 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    అఖండ, పుష్పను దాటని భీమ్లా

    అఖండ, పుష్పను దాటని భీమ్లా

    ‘భీమ్లా నాయక్' మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దీంతో మొదటి వారం ఈ చిత్రానికి ఏకంగా రూ. 70.40 కోట్లు వచ్చాయి. కానీ, రెండో వారం కేవలం రూ. 4.62 కోట్లే వసూలు అయ్యాయి. దీంతో రెండో వారం ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో ఇది చేరలేదు. ఇక, ఇటీవలే విడుదలైన పుష్ప రెండో వారం రూ. 11.66 కోట్ల రాబట్టగా.. అఖండ రూ. 9.82 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie Collects Rs 95.70 Cr in 14 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X