Bheemla Nayak 3 Weeks Collections: 108 కోట్ల టార్గెట్.. మూడు వారాల్లో ఇంతే.. ఇంకెంత రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. కొంత కాలంగా ఆ జోనర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవన్నీ భారీ సక్సెస్‌లను అందుకున్నాయి. దీంతో అలాంటివే మరిన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే 'భీమ్లా నాయక్'. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించారు. దీంతో ఆరంభం నుంచే దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, కలెక్షన్లు మాత్రం మొదట్లో వచ్చినట్లుగా రావడం లేదు. ఫలితంగా ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చాలా దూరంలోనే ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

పవన్, రానా.. ‘భీమ్లా నాయక్’
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీనే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

21వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
'భీమ్లా నాయక్' మూవీకి ఆరంభంలో కలెక్షన్లు భారీగా వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబట్టింది. అయితే, క్రమంగా అవి తగ్గుతూ వస్తున్నాయి. ఇక, 'రాధే శ్యామ్' సహా పలు చిత్రాలు విడుదల కావడంతో మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 21వ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 3 లక్షలే వచ్చాయి.

3 వారాలకూ కలిపి ఎంతొచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో 'భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.64 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.08 కోట్లు, గుంటూరులో రూ. 5.26 కోట్లు, కృష్ణాలో రూ. 4.22 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.61 కోట్లు షేర్, రూ. 117.44 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
3 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 76.61 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.52 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 వారాల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 158.64 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లోనే రూ. 97.36 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 10.64 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











