Bheemla Nayak 9 days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. ఆ మార్కు దాటినా నిరాశ.. ఇంకెంత రావాలంటే!
'భీమ్లా నాయక్'.. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సినిమా ఇది. అంతలా ఈ మూవీ దాదాపు నెల రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. దీనికి కారణం ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించడమే. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచే భారీ స్పందనను అందుకుంటూ కలెక్షన్లను రాబడుతోంది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమాకు నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం కలెక్షన్లు బాగానే పెరిగాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సినిమా 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రివేంజ్ స్టోరీతో ‘భీమ్లా నాయక్'
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రివేంజ్ డ్రామాగా రూపొందిన చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

9వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'భీమ్లా నాయక్'కు 9వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు కొంత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి శనివారం రూ. 1.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 1.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' 9 రోజుల్లో బాగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 33.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.17 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.18 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.75 కోట్లు, గుంటూరులో రూ. 4.95 కోట్లు, కృష్ణాలో రూ. 3.52 కోట్లు, నెల్లూరులో రూ. 2.40 కోట్లతో కలిపి రూ. 72.21 కోట్లు షేర్, రూ. 109.95 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 72.21 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 9 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 91.96 కోట్లు షేర్‌తో పాటు రూ. 149.75 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
భారీ అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో రూ. 91.96 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 16.04 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

శనివారం పెరిగినా.. నిరాశగానే
పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో వచ్చిన 'భీమ్లా నాయక్' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అయితే, అనుకున్న దానికంటే తక్కువే వచ్చాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











