Bheemla Nayak Day 1 Collections: బాక్సాఫీస్‌పై పవన్ పంజా.. ఒక్క రోజే అన్ని కోట్లు ఏంటి సామీ!

రెండేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి కరోనా వల్ల తీవ్ర స్థాయిలో నష్టాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఏడాది ఆరంభంలో మాత్రం భారీ చిత్రాలు వచ్చి బాక్సాఫీస్ కళకళలాడింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. కోవిడ్ ప్రభావం కారణంగా ఎన్నో భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి సీజన్ అంత వెలవెలబోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుని శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'భీమ్లా నాయక్'. పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కలయికలో భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రం ఎక్కడ? ఎంత? కలెక్షన్లను రాబట్టిందో మీరూ చూడండి!

క్రేజీ కాంబలో వచ్చిన భీమ్లా నాయక్

క్రేజీ కాంబలో వచ్చిన భీమ్లా నాయక్

బడా హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో రూపొందిన భారీ చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ డీటేల్స్

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ డీటేల్స్


తెలుగులోనే భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో పవన్ - రానా కలయికలో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర వ్యాపారం జరిగింది.

పాజిటివ్ టాక్.. హౌస్‌ఫుల్ బోర్డులతో

పాజిటివ్ టాక్.. హౌస్‌ఫుల్ బోర్డులతో

ఎన్నో అంచనాలతో ‘భీమ్లా నాయక్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. ఈ సినిమా ఫలితంతో అటు ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇక, రెండో రోజూ హౌస్‌ఫుల్ బోర్డులతో సినిమా నడుస్తోంది.

తొలి రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

తొలి రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


‘భీమ్లా నాయక్' మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్ డే నైజాంలో రూ. 11.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.88 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.02 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 1.04 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26.42 కోట్లు షేర్, రూ. 38 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 26.42 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ హవా చూపించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా తొలి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 56.50 కోట్ల గ్రాస్ దక్కింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

భారీ అంచనాల నడుమ వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి రోజే రూ. 36.37 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 71.63 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ చేరుకుంటుంది.

Recommended Video

Bheemla Nayak Review: Pawan Kalyan And Rana Daggubati powerful Power-packed performance
ఆ రెండు చోట్లా భీమ్లా నాయక్ హవా

ఆ రెండు చోట్లా భీమ్లా నాయక్ హవా


పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో నటించిన ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందనే దక్కింది. మరీ ముఖ్యంగా ఇది నైజాంలో రూ. 11.85 కోట్లు వసూలు చేసి ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌ను అందుకుంది. అలాగే, ఓవర్సీస్‌లో మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటేసి ఈ చిత్రం సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X