Bheemla Nayak Day 2 Collections: 2 రోజు షాకింగ్ కలెక్షన్లు.. ఆ మూవీ కంటే తక్కువైనా రికార్డు బ్రేక్
తెలుగు సినీ ఇండస్ట్రీకి 2022వ సంవత్సరంలో సరైన ఆరంభం దక్కలేదు. కోవిడ్ ప్రభావం పెరిగిన కారణంగా ఈ సారి ఎంతో ముఖ్యమైన సంక్రాంతి సీజన్ చప్పగా సాగింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిలో వచ్చే సినిమాల మీదే పడింది. అందుకు అనుగుణంగానే విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న చిత్రం 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా ఇందులో కలిసి నటించడంతో దీనికి భారీ హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. మరి ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

స్టార్ హీరోల కలయికలో భీమ్లా నాయక్
టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ డీటేల్స్
క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో పవన్ - రానా కలయికలో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ అయింది.

2వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
రెండో రోజూ ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నైజాంలో రూ. 7.48 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.29 కోట్లు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 64 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో కలిపి రూ. 13.14 కోట్లు షేర్, రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
రెండు రోజులకు కలిపితే తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 19.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.17 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.69 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.44 కోట్లు, గుంటూరులో రూ. 3.16 కోట్లు, కృష్ణాలో రూ. 1.53 కోట్లు, నెల్లూరులో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 39.56 కోట్లు షేర్, రూ. 58 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 39.56 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.35 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 2 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 80.40 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో రూ. 51.86 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 56.14 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.
Recommended Video

తక్కువైనా.. ఆ రికార్డు సొంతమైంది
‘భీమ్లా నాయక్' మూవీ రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.14 కోట్లు రాబట్టింది. దీంతో ఈ జాబితాలో మూడో స్థానానికి చేరింది. రెండో రోజు కలెక్షన్ల జాబితాలో బాహుబలి (14.80 కోట్లు), పుష్ప (13.70 కోట్లు) దీనికంటే ముందున్నాయి. ఇక, ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో ఎక్కువ షేర్ (51.86 కోట్లు) సాధించిన చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. దీంతో ఉప్పెన రికార్డు బద్దలైంది.


Click it and Unblock the Notifications











