Bheemla Nayak Day 4 Collections: సోమవారం డీలా పడ్డ 'భీమ్లా నాయక్'.. వసూళ్ళలో భారీ డ్రాప్.. ఎంత వచ్చాయంటే?
విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పరచుకున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - భల్లాలదేవుడు దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన తరువాత మొదటి ఆట నుంచి మంచి టాక్‌ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా అద్భుతమైన తీరుతో ముందుకు వెళుతోంది. రిలీజైన రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా దాటేసిన ఈ సినిమా మూడో రోజు కూడా ఆదివారం కావడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది.
Recommended Video
అయితే నాలుగో రోజు సోమవారం కావడంతో అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. మరి నాలుగో రోజు సినిమా ఎలా వసూళ్లు రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం ఎంత రాబట్టాలి అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ రిపోర్టు చూడాల్సిందే.

భారీ అంచనాలతో
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో 'భీమ్లా నాయక్' పేరుతో రూపొందించారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో ఈ సినిమాను ప్లాన్ చేసి ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు సినిమా మీద ఏర్పాడ్డాయి ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వచించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాక స్క్రీన్ ప్లే సహా మాటలు కూడా అందించాడు.
థమన్ సినిమాకు సంగీతం సమకూర్చడమే కాక రీ రికార్డింగ్ కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ ఆర్ఆర్ సినిమా మొత్తానికి భారీ అసెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.అలాగే రావు రమేష్, రవి వర్మ, మురళీ శర్మ, రఘుబాబు, చౌదరి, సముద్ర ఖని వాంతి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ప్రీ రిలీజ్ బిజెనెస్
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, మిగతా భారత దేశం మొత్తం 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు మరో తొమ్మిది 9 కోట్లకు అమ్ముడు పోయాయి. ఆ లెక్కన పవన్ - రానా లాంటి బడా స్టార్స్ కాంబినేషన్ లో వచ్చిన ఈ 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది.

నాలుగో రోజు భారీ డ్రాప్స్
'భీమ్లా నాయక్'కు 4వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ డ్రాప్స్ కనిపించాయి. సోమవారం నాడు సెలవు రోజు కాకపోవడంతో ఈ డ్రాప్స్ వచ్చాయని చెప్పచ్చు. ట్రేడ్ వర్గాల అంచనాల మేరకు నైజాంలో రూ. 2.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్‌లో రూ. 35 లక్షలు, వెస్ట్‌లో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి రూ. 5.18 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' మొదటి మూడు రోజుల్లో బాగా రాబట్టింది కానీ నాలుగో రోజు డ్రాప్స్ కారణంగా టోటల్ కలెక్షన్స్ మీద కూడా ప్రభావం పడింది. ఫలితంగా నైజాంలో రూ. 28.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.5.37 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.95 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.12 కోట్లు, గుంటూరులో రూ. 4.22 కోట్లు, కృష్ణాలో రూ. 2.63 కోట్లు, నెల్లూరులో రూ. 1.98 కోట్లతో కలిపి రూ. 58.25 కోట్లు షేర్, రూ. 79.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
ఏపీ, తెలంగాణలో 4వ రోజున డ్రాప్స్ కనిపించడంతో కేవలం రోజుల్లో రూ. 58.25 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లో కూడా డ్రాప్స్ చవి చూసింది. ఫలితంగా కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 10.31 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 4 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 120 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే
ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 75.21 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 31.53 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్ సంపాదిస్తుంది. మరి చూడాలి ఎన్ని రోజులకు సినిమా హిట్ స్టేటస్ సంపాదిస్తుంది అనేది.


Click it and Unblock the Notifications











