Bheemla Nayak Day 5 Collections: పండుగ రోజు ఊహించని విధంగా.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో పవన్ మూవీ

'భీమ్లా నాయక్'.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించడమే. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అంతేకాదు, ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా అదే రీతిలో జరుపుకుని గత శుక్రవారమే గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభం నుంచే భారీగా స్పందన వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే యాభై కోట్ల రూపాయల షేర్‌ను కూడా దాటేసింది. నాలుగో రోజు తగ్గినా.. ఐదో రోజు మళ్లీ ఈ చిత్రానికి వసూళ్లు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' ఐదు రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

 ప్రతీకార సబ్జెక్ట్‌తో ‘భీమ్లా నాయక్'

ప్రతీకార సబ్జెక్ట్‌తో ‘భీమ్లా నాయక్'

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో ప్రతీకార నేపథ్యంతో వచ్చిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఈ భారీ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా


క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మంకగా వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్‌ను పూర్తి చేసుకుంది.

 5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

5వ రోజు ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 2.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 89 లక్షలు, ఈస్ట్‌లో రూ. 74 లక్షలు, వెస్ట్‌లో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి రూ. 7.25 కోట్లు షేర్, రూ. 12.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


ఐదు రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో ‘భీమ్లా నాయక్' బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 31.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.26 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.69 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.48 కోట్లు, గుంటూరులో రూ. 4.65 కోట్లు, కృష్ణాలో రూ. 3.13 కోట్లు, నెల్లూరులో రూ. 2.22 కోట్లతో కలిపి రూ. 65.50 కోట్లు షేర్, రూ. 91.30 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

 ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 65.50 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన ‘భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ సత్తాను చాటుకుంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.20 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 5 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 84.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 135 కోట్ల గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘భీమ్లా నాయక్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 84.00 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 24 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ చేరుతుంది.

Recommended Video

Bheemla Nayak Review: Pawan Kalyan And Rana Daggubati powerful Power-packed performance
పండుగ రోజు భారీ స్థాయిలో రాబట్టి

పండుగ రోజు భారీ స్థాయిలో రాబట్టి


‘భీమ్లా నాయక్' మూవీకి మొదటి వీకెండ్‌లో మంచి కలెక్షన్లు వచ్చాయి. అయితే, సోమవారం మాత్రం సగానికి సగం వసూళ్లు పడిపోయాయి. దీంతో అదే కంటిన్యూ అవుతుందని అనుకున్నారు. అయితే, మంగళవారం మహా శివరాత్రి పండుగ రోజు దీనికి స్పందన భారీగా పెరిగింది. దీంతో మళ్లీ వసూళ్లు పెరిగాయి. దీనివల్ల విజయానికి ఈ సినిమా మరింత చేరువగా వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X