Bheemla Nayak Collections: భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు.. పవన్ దెబ్బకు పుష్ప, బాహుబలి వెనక్కే!

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో రకాల చిత్రాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు అంచనాలను ఏర్పరచుకుంటాయి. అలాంటి వాటిలో క్రేజీ మల్టీస్టారర్‌గా వచ్చిన 'భీమ్లా నాయక్' ఒకటి. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా ఇందులో కలిసి నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి నుంచీ భారీ హైప్ ఏర్పడడంతో బిజినెస్ కూడా అత్యధిక స్థాయిలో జరిగింది. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ఆల్‌ టైం రికార్డును క్రియేట్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

 బడా మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

బడా మల్టీస్టారర్‌గా భీమ్లా నాయక్

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను అందించాడు. థమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. ఇందులో మలయాల భామలు నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

 బిజినెస్‌కు తగ్గట్లే.. గ్రాండ్‌ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లే.. గ్రాండ్‌ రిలీజ్


ఇద్దరు స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు రూ. 106.75 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2000 పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

హిట్ టాక్... యూనిట్ ఫుల్ ఖుషీ

హిట్ టాక్... యూనిట్ ఫుల్ ఖుషీ

ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అన్ని ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. ఈ సినిమా ఫలితంతో అటు ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు.

 మొదటి రోజు రికార్డు స్థాయిలోనే

మొదటి రోజు రికార్డు స్థాయిలోనే

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు భారీ స్పందనను అందించారు. ఫలితంగా దీనికి రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. విశ్లేషకులు అంచనా ప్రకారం.. దీనికి రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందట.

 అక్కడ మాత్రం ఆల్ టైం రికార్డ్

అక్కడ మాత్రం ఆల్ టైం రికార్డ్

పవన్ - రానా కలయికలో భారీ స్థాయిలో విడుదలైన ‘భీమ్లా నాయక్' మూవీకి అన్ని చోట్ల కంటే నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లు దక్కాయి. అక్కడ పవర్ స్టార్‌కు ఎక్కువ మార్కెట్ ఉండడంతో ఆ ఒక్క ప్రాంతంలోనే దీనికి మొదటి రోజు ఏకంగా రూ. 11.85 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో ‘భీమ్లా నాయక్' మూవీ టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది.

పుష్ప రికార్డును బ్రేక్ చేసేశాడుగా

పుష్ప రికార్డును బ్రేక్ చేసేశాడుగా


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘భీమ్లా నాయక్' మూవీకి నైజాం ఏరియాలో మొదటి రోజు రూ. 11.85 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో తెలుగులో అక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మొదటి స్థానానికి చేరుకుంది. తద్వారా ‘పుష్ప' పేరిట ఉన్న రూ. 11.44 కోట్ల రికార్డును చెరిపేసింది. ఈ జాబితాలో ‘సాహో', ‘బాహుబలి 2' మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Recommended Video

Bheemla Nayak Team Celebrations కళ్యాణ్ ఫాన్స్ కి గురూజీ బాకీ తీర్చేసాడుగా | Filmibeat Telugu
ఐదో స్థానం కూడా పవర్ స్టార్‌దే

ఐదో స్థానం కూడా పవర్ స్టార్‌దే


తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు నైజాంలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే అక్కడ అతడి సినిమాలకు కలెక్షన్లు పోటెత్తుతాయి. ఇప్పుడు ‘భీమ్లా నాయక్'తో అది మరోసారి నిరూపణ అయింది. గత ఏడాది వచ్చిన ‘వకీల్ సాబ్'కు కూడా ఫస్ట్ డే రూ. 8.75 కోట్లు వచ్చాయి. అందుకే ఈ జాబితాలో ఆ చిత్రం ఐదో స్థానంలోనే కొనసాగుతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X