Bheemla Nayak Pre Booking Status: మహేష్ సినిమా థియేటర్ లో పవన్ దూకుడు.. బీభత్సం!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అసలైన మాస్ సినిమా ఫెస్టివల్ మొదలైంది. పుష్ప సినిమా తర్వాత ఇంతవరకు మరొక సినిమా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తో అనుకున్నంతగా సందడి చేయలేక పోయాయి. ఇక ఇప్పుడు 2022లో అసలైన అసలైన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న మొదటి సినిమా భీమ్లా నాయక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బూకింగ్స్ తోనే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మహేష్ బాబు పాట్నర్ గా ఉన్నటువంటి సినిమా థియేటర్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బుక్ మై షో లో మొదటి రోజు ఏ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయి అనే వివరాల్లోకి వెళితే..

2022 ఫస్ట్ రికార్డ్

2022 ఫస్ట్ రికార్డ్

సితార ఎంటర్టైన్ మెంట్స్ లో యువ నిర్మాత నాగ వంశీ నిర్మించిన భీమ్లా నాయక్ సినిమాను సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందించడంతో సినిమాకు మరింత బలం చేకూరింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అయితే ఒక సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని ప్రస్తుతం నెలకొన్న బజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మొదటిరోజు 2022లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రికార్డును క్రియేట్ చేయనుంది

ఓవర్సీస్ లో కూడా

ఓవర్సీస్ లో కూడా

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అయితే 24వ తేదీన ప్రీమియర్ షోలకు సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు ఫినిష్ అయ్యాయి. ఇక అమెరికాలో అయితే ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ ద్వారా 300k దాలర్లను అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా వరకు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుజున్నాయి. ఇక భీమ్లా నాయక్ మలయాళం AK సినిమాకు రీమేక్ కాబట్టి ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పవచ్చు.

బుక్ మై షోలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

బుక్ మై షోలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా అంచనాలకు మించి రికార్డ్ సాధిస్తుందనే అందరూ అనుకుంటున్నారు. ఇక భీమ్లా నాయక్ ఇటీవల బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా చాలావరకు మేజర్ థియేటర్లలో నిమిషాల్లోనే అన్ని టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొదటిరోజు నైజాంలో అయితే దాదాపు అన్ని ఏరియాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా టికెట్లు చాలావరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అమ్ముడైనట్లు సమాచారం.

మహేష్ AMBలో హౌస్ ఫుల్

మహేష్ AMBలో హౌస్ ఫుల్

ఇక మహేష్ బాబుకు సంబంధించిన AMB సినిమాస్ లో అయితే భీమ్లా నాయక్ మొదటిరోజుకు సంబంధించిన అన్ని టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. మొదటిరోజు AMB సినిమాస్ లో మొత్తం 16 షోలు ప్రదర్శించబడనున్నాయి. ఇక ఆ షోలకు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. శని ఆదివారాలకు సంబంధించిన టికెట్లు కూడా చాలా వరకు ముందుగానే సేల్ అవుతున్నాయి. మరి సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X