Bro Advance Booking ఓవర్సీస్‌లో పవన్ కల్యాణ్ సునామీ.. యూకే, యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ జోరు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమా కథా ఆధారంగా ఈ సినిమాను నటుడు, దర్శకుడు సముద్రఖని రూపొందించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. బ్రో ది వారియర్ (Bro The Avataar) మూవీ వివరాలు, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బ్రో ది అవతార్ మూవీ కోసం పవన్ కల్యాణ్ అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది.

బ్రో సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 22వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతంగా సినిమాను రిలీజ్ చేస్తున్నది. ఈ సినిమాపై ఉన్న అంచనాల ప్రకారమే ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికా, యూకేలో గ్రాండ్‌గా మొదలైంది.

బ్రో సినిమా యూకే అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది. ఈ సినిమాను 40 లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా ఈ సినిమా లొకేషన్, స్క్రీన్ల కౌంట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా 52 షోల కోసం 3020 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా 7 రోజుల గడువు ఉండగానే.. అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొన్నది.
బ్రో సినిమా అమెరికా అడ్వాన్స్ బుకింగ్ కూడా గ్రాండ్‌గా మొదలైంది. ఈ సినిమాను ఇప్పటి వరకు 49 లోకేషన్లు ఖరారు అయ్యాయి. ఇప్పటి వరకు 153 షోల కోసం ఏర్పాటు చేశారు. లోకేషన్లు, షో కౌంట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి 35K డాలర్లు వసూలు అయ్యాయి.


Click it and Unblock the Notifications











