BRO మూవీ రిలీజ్‌పై నిర్మాత సంచలన నిర్ణయం.. ఆ ప్రాంతంలో సింగిల్ హ్యాండ్‌తో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా రిలీజ్‌కు సిద్దం కాబోతున్నది. తొలిసారి తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ నటిస్తున్న ఈ సినిమాను నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అయితే ఈ సినిమా బిజినెస్ వివరాలు, ఓవర్సీస్ రిలీజ్ గురించిన విషయాల్లోకి వెళితే..
Bro The Avatar చిత్రం తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా తెలుగులో రూపొందించారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినీ విమర్శకులనే కాకుండా సగటు ప్రేక్షకుడి నుంచి మంచి ప్రశంసలు అందుకొన్నది. దాంతో తెలుగులో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌తో చేయాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సిద్దమైంది.

అయితే Bro మూవీ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ సుమారుగా 40 నుంచి 50 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 100 కోట్ల మేర బడ్జెట్ అని చెప్పుకొంటున్నారు.
ఇక బ్రో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తంగా 115 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 130 కోట్ల మేర జరుగవచ్చని అంచనా వేశారు.

అయితే ఓవర్సీస్ విషయంలో ప్రధానంగా అమెరికాలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. అమెరికాలో స్వయంగా రిలీజ్ చేయాలని టీజీ విశ్వ ప్రసాద్ డిసైడ్ అయ్యారు. గతంలో తాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ పేరుతో Bro మూవీని రిలీజ్ చేయడానికి అన్ని రకాల ప్లాన్స్ చేస్తున్నారు.
బ్రో సినిమాను స్వయంగా రిలీజ్ చేయాలనే విషయం వెనుక వస్తున్న రూమర్లను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు తోసిపుచ్చారు. అవాస్తవాలతో రాసే వార్తలను, సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని కొట్టిపడేశారు. అమెరికాలో గ్రాండ్‌గా, అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











