Bro Pre Release Business సెంచరీ కొట్టిన పవన్ కల్యాణ్.. రికార్డు ధరకు బ్రో ప్రీ రిలీజ్ బిజినెస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కామెడీ ఫాంటసీ చిత్రం బ్రో. నటుడు, దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. జూలై 28వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదు చేసింది. ఈ బ్రో సినిమా ఓవర్సీస్ రిలీజ్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న బ్రో సినిమా ఫస్ట్ లుక్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇటీవల రిలీజైన టీజర్ రికార్డులు తిరగరాసింది. యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సొంతం చేసుకొన్నది. దాంతో బ్రో చిత్రం సోషల్ మీడియాలోను, ఇతర సామాజిక మాధ్యమాల్లోను సంచలనం రేపుతున్నది.

Pawan Kalyans Bro: The Avatar movie Pre Release Theatrical business worldwide

ఫస్ట్ లుక్, టీజర్లతో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా అన్ని వర్గాల్లోను ఆసక్తిని పెంచింది. జూలై 28వ తేదీన వస్తున్న ఈ సినిమాను చూసేందుకు అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో ఈ సినిమాపై క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో బ్రో సినిమా ఓవర్సీస్ హక్కులను అమెరికాకు చెందిన పీపుల్స్ సినిమాస్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నది.

బ్రో ది అవతార్ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఆంధ్రా హక్కులు 40 కోట్ల రూపాయలకు, నైజాం హక్కులను 30 కోట్లు, సీడెడ్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 83 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని రిపోర్టు.

ఇక తెలుగేతర రాష్ట్రాల హక్కులు కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులకు భారీ రేటు పలికినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఈ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా హక్కులు 13 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

Pawan Kalyans Bro: The Avatar movie Pre Release Theatrical business worldwide

ఇక బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా హక్కుల వివరాల్లోకి వెళితే.. పవన్ కల్యాణ్ కెరీర్‌లో బెస్ట్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విలువ 100 కోట్ల రూపాయలు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన బాక్సాఫీస్ లెక్కలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్వీరాజ్, నర్రా శ్రీను, యువ లక్ష్మీ, దేవిక, ఆలీ రెజా, సూర్య శ్రీనివాస్ తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభోట్ల
డీవోపీ: సుజిత్ వాసుదే
మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎడిటర్: నవీన్ నూలీ
పీఆర్వో: వేణుగోపాల్
రిలీజ్ డేట్: 2023-07-04

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X