Gabbar Singh 4k Advance Booking: రీరిలీజ్‌లో గబ్బర్ సింగ్ ప్రభంజనం.. అడ్వాన్స్ సేల్స్‌తోనే ఎన్ని కోట్లంటే?
ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్ హీరోలు ఒకరిని చూసి మరొకరు తమ హిట్ సినిమాలను మరోసారి 4కే వెర్షన్‌లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఖుషి, మురారి, పోకిరి, ఇంద్ర సినిమాలు రీ రిలీజ్‌లోనూ మంచి వసూళ్లు సాధించడంతో ఈ కోవలో మరిన్ని చిత్రాలు వస్తాయని భావిస్తున్నారు. హీరోల బర్త్ డేలు, లేదంటే ఆయా హిట్ చిత్రాల ల్యాండ్ మార్క్ ఇయర్స్‌ను పురస్కరించుకుని రీరిలీజ్‌లతో దిగుతున్నారు.
ఇదిలాఉండగా .. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటన, స్టైల్, మేనరిజంతో పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్ కళ్యాణ్. వరుసగా పదేళ్లు ఫ్లాపుల్లో ఉన్నా స్టార్‌డమ్ తగ్గకపోగా మరింత పెరిగిన అరుదైన ఘనత పవన్ సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో గబ్బర్ సింగ్‌కు ప్రత్యేక స్థానముంది. రకరకాల సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

ఈ దశలో పవన్ అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది గబ్బర్ సింగ్. ఈ సినిమా వచ్చే అప్పుడే 12 ఏళ్లు గడుస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. పుష్కరకాలం క్రితం మండుటెండలో మే 11, 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా చూపించి వారి ఆకలిని తీర్చారు హరీష్ శంకర్.
హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారు హరీశ్ శంకర్. తొలుత ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నాగబాబు తీయాలనుకున్నారు , అయితే అప్పటికే ఆరెంజ్ మూవీతో నష్టాల్లో ఉన్నందున బండ్ల గణేష్ చేతికి గబ్బర్ సింగ్ దక్కింది. అసలే ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడు కావడంతో ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించారు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.79 కోట్ల వసూళ్లను సాధించింది. 306 కేంద్రాల్లో 50 రోజులు... 65 కేంద్రాల్లో 100 రోజులు ఆడి పవన్ స్టామినా ఏంటో నిరూపించింది.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 1న ఈ సినిమాను 4కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేయనున్నారు. నార్త్ అమెరికాలో 100కు పైగా లోకేషన్‌లలో ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. రీ రిలీజ్‌లలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమా దిశగా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో ప్రీమియర్స్ ద్వారా 17 లక్షలు, తొలి రోజు బుకింగ్స్ ద్వారా రూ.1.05 కోట్లు మొత్తంగా రూ.1.22 కోట్ల వసూళ్లు సాధించింది.
ఆస్ట్రేలియాలో 12 షోలకు గాను ప్రీ బుకింగ్స్ ద్వారా 4,284 ఆస్ట్రేలియా డాలర్లు కొల్లగొట్టింది. అమెరికాలోని 55 లోకేషన్స్‌లో రూ.13 లక్షలకు పైగా వసూళ్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అప్పుడే రూ.3 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది గబ్బర్ సింగ్. రీ రిలీజ్‌కు ఇంకాస్త టైమ్ ఉండటంతో అప్పటికి పవన్ కళ్యాణ్ మరిన్ని రికార్డులు కైవసం చేసుకుంటాడని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











