Pawan Kalyan మరో రీ రిలీజ్.. ఈ ఏడాదిలో 4వ సినిమా.. బుకింగ్స్ అరాచకం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చాలా బిజీగా ప్రజాసేవలో పాల్గొంటూనే మరొకవైపు వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదల అవుతున్న కాకపోయినా కూడా ఫాన్స్ మాత్రం ఆయన పాత సినిమాలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మొత్తం మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగవ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

ఆ సినిమా మరేదో కాదు పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన గబ్బర్ సింగ్ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హిందీ సినిమా దబాంగ్ కు ఇది రీమేక్ అయినప్పటికీ కూడా తెలుగులో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి నిర్మాత సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Pawan kalyan gabbar singh movie re release advance booking mind blowing collections

ఈ ఏడదే పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు హడావిడిలో తమ్ముడు సినిమాతో పాటు జల్సా 4K మళ్ళీ విడుదల అయ్యింది. ఇక జల్సా అయితే బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ రికార్డులు అన్నిటినీ కూడా చెరిపివేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరులో కూడా గబ్బర్ సింగ్ సినిమాలో భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు.

ఇక అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పటికే భారీ స్థాయిలో నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈనెల 11వ తేదీన విడుదల మళ్ళీ కాబోతున్న గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఇప్పటికే కోటి 30 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్ళను అందుకున్నట్లు సమాచారం. కేవలం అడ్వాన్స్ తోనే ఈ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేశాడు అంటే ఇక తప్పకుండా పవనిజమ్ డే.. రీ రిలీజ్ రోజు మొత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ మరొక రేంజ్ లో ఉంటాయి అని అనిపిస్తోంది. హైదరాబాదులో బుక్ మై షో లో రీ రిలీజ్ టికెట్లు అలా విడుదల చేయగానే సోల్డ్ అవుట్ అని దర్శనమిస్తున్నాయి. తిని బట్టి పవన్ కళ్యాణ్ స్టార్ హోదా ఇంకా ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X