100 కోట్లు.. జూ.ఎన్టీఆర్, విజయ్, రజనీ కంటే.. పవన్ కళ్యాణ్ పైనే భారం?
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కావడం విశేషం. అయితే తొలి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్స్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో హరి హర వీరమల్లు చిత్రానికి తెలుగు స్టేట్స్ లో రాబట్టాల్సిన షేర్ వసూల్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రజనీకాంత్ రాబోయే చిత్రాలతో పోల్చితే పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రానికి భారీగానే టార్గెట్ ఫిక్స్ అవ్వడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే..
హరి హర వీరమల్లు చిత్రం బడ్జెట్..
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఏఎం నిర్మాత భారీ బడ్జెట్ తో నిర్మించారు. స్టార్ కాస్ట్, భారీ సెట్స్, చాలా కాలం ఆలస్యం కావడంతో ఈ సినిమాకు నిర్మత అంచనాకు మించి ఖర్చు చేయాల్సి వచ్చింది. టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేయడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్లు పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వీరమల్లు చిత్రం బిజినెస్..
5 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం హరి హర వీరమల్లు కావడం విశేషం. దాని తోడు తొలిసారిగా పవన్ కళ్యాణ్ నుంచి పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కాబోతుండటంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ నిపుణులు లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇండియాలో రూ.117 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో మరో 10 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.127 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ కే ఎక్కువ టార్గెట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో పాటు మరి కొద్ది రోజుల్లోనే విజయ్ దేవరకొండ కింగ్డమ్, రజనీకాంత్ కూలీ చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు తెలుగు స్టేట్స్ లో వసూల్ చేయాల్సిన షేర్ కలెక్షన్స్ కన్నా.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుకే ఎక్కువ టార్గెట్ ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రూ.87 కోట్లు, రజనీకాంత్ కూలి రూ.46 కోట్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం రూ.36 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం మాత్రం రూ.100 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషణ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీయర్ లోనే హరి హర వీరమల్లు చిత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ నుంచి నెక్ట్స్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలు రానున్నాయి.


Click it and Unblock the Notifications











