twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాకు క్రేజీ డీల్.. కెరీర్ లోనే అత్యధికంగా..

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రానున్న రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు తెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మన అగ్రహీరోలు వీలైనంత ఎక్కువగా పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన జీవితంలో బిగ్ బడ్జెట్ లో హరిహర వీరమల్లు అనే పాన్ సినిమాతో సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సినిమా మ్యూజిక్ హక్కులను ఇటీవల ఒక బాలీవుడ్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. అందుకోసం భారీ స్థాయిలో డీల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

    భారీ స్థాయిలో..

    భారీ స్థాయిలో..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ జీవితంలో ఇంతవరకు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయలేదు. ఇక మొదటిసారి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా తెలుగులోనే కాకుండా హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఖుషి నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

    చారిత్రక అంశాలను..

    చారిత్రక అంశాలను..

    హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. పిరియాడిక్ హిస్టారికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయట. దర్శకుడు క్రిష్ సినిమాలో చారిత్రక అంశాలను ఎక్కువగా చూపించబోతున్నారు తెలుస్తోంది.

    బాలీవుడ్ సంస్థకు ఆడియే హక్కులు

    బాలీవుడ్ సంస్థకు ఆడియే హక్కులు

    ఇక ఈ సినిమా కోసం రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆయనకు కూడా ఇది పవన్ కళ్యాణ్ మొదటి కాంబినేషన్ కావడంతో మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి. దర్శకుడు క్రిష్ కూడా సినిమాల్లో సంగీతానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇక ఈ సినిమా మ్యూజిక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ సంస్థ టిప్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం.

    బిగ్ ఆఫర్..

    బిగ్ ఆఫర్..

    హరిహర వీరమల్లు సినిమాకు భారీ స్థాయిలో ఆఫర్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల డిజిటల్ శాటిలైట్ హక్కుల పై కూడా చర్చలు జరిగాయి. అయితే ముందుగా ఈ చిత్ర నిర్మాత ఆడియో హక్కులను టిప్స్ సంస్థకు అమ్మినట్లు తెలుస్తోంది. దాదాపు 5 కోట్ల నుంచి 6కోట్ల మధ్యలో ఆదాయం అందినట్లు సమాచారం. ఒక విధంగా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో కూడా ఇది అత్యధిక డీల్ అని చెప్పవచ్చు.

     విడుదల ఎప్పుడంటే..

    విడుదల ఎప్పుడంటే..

    ఇక సినిమా విడుదల విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. అసలైతే సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ కూడా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది. ఇక సమ్మర్ లోనే హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Pawan kalyan Harihara veeramallu big deal in bollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X