twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jalsa Rerelease: పోకిరి రికార్డు బ్లాస్ట్ అయ్యేలా పవన్ ఫ్యాన్స్ ప్లాన్.. బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్?

    |

    ఇటీవల పోకిరి సినిమాను మరోసారి థియేటర్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాకు ఫ్యాన్స్ నుంచి ఎవరూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మహేష్ అభిమానులు చాలా హడావిడిగా వారి అభిమాన హీరో పుట్టినరోజును పోకిరి సినిమాతో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో మిగతా అగ్ర హీరోల అభిమానులు కూడా స్టార్స్ పుట్టినరోజున ప్రత్యేకంగా స్పెషల్ షోలను ప్రదర్శించుకోవాలి అనే ఫిక్స్ అయ్యారు. ఇక జల్సా సినిమా కూడా పవన్ పుట్టినరోజున సందడి చేయబోతోంది. అయితే పోకిరి సినిమా రికార్డు బ్లాస్ట్ అయ్యేలా జల్సా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

    డిమాండ్ పెరగడంతో..

    డిమాండ్ పెరగడంతో..

    పూరి జగన్నాథ్ మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన ఆ సినిమా మరోసారి థియేటర్లో విడుదల చేసిన కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా మహేష్ పుట్టినరోజున ఏదో 20 షోలు వేయాలని అనుకున్నారు కానీ.. వచ్చిన డిమాండ్ ను బట్టి దాదాపు 370 కి పైగా షోలను చేయాల్సి వచ్చింది.

     మరోసారి జల్సా

    మరోసారి జల్సా

    ఒక విధంగా పోకిరి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పుడు మిగతా స్టార్ హీరోల అభిమానులలో కూడా ఒక హడావిడి మొదలైంది. వారి అభిమాన హీరోలా బెస్ట్ సినిమాలను కూడా థియేటర్లో వేసుకుని చూడాలని అనుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మరోసారి జల్సా సినిమాను చూడాలి అని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా అప్పట్లో థియేటర్లో పెద్దగా సక్సెస్ కాలేదు. తనే బుల్లితెరపై మాత్రం మంచి రేటింగ్స్ అందుకుంది.

     4K క్వాలిటీలో..

    4K క్వాలిటీలో..

    ఇక జల్సా సినిమాను మళ్ళీ విడుదల చేస్తే తప్పకుండా థియేటర్లో అందరినీ ఆకట్టుకుంటుంది అనే విధంగానే ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు గీతా ఆర్ట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 4కే ఫార్మాట్లో ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు సమాచారం.

    పోకిరి కంటే ఎక్కువ షోలు

    పోకిరి కంటే ఎక్కువ షోలు

    పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన జల్సా సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో అలాగే మిగతా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన షోలు ప్రదర్శించాలని ఫిక్స్ అవుతున్నారు. దాదాపు 500 కు పైగా షోలను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే జరుగితే పోకిరి సినిమా రీ రిలీజ్ రికార్డును జల్సా సినిమా బ్రేక్ చేసినట్లే లెక్క.

    Recommended Video

    కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia
    బాక్సాఫీస్ టార్గెట్

    బాక్సాఫీస్ టార్గెట్

    ఇక పోకిరి సినిమా రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు కోటిన్నరకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు 500 ధియేటర్లలో జల్సా సినిమా విడుదలయితే కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు తాకిడికి ఈజీగా ఆ రికార్డు బ్రేక్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక మహేష్ బాబు అభిమానుల తరహాలోనే జల్సా సినిమా ద్వారా వచ్చిన డబ్బును కూడా ఒక మంచి పని కోసం ఉపయోగించాలి అనే అభిమానులు రెడీ అవుతున్నారు.

    English summary
    Pawan kalyan jalsa movie huge rerelease plan fix
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X