Jalsa Special Show మహేష్ రికార్డును పవన్ బ్రేక్.. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ కిర్రాక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానులు పండుగ వాతావరణాన్ని తలపించేలా వేడుకలు చేస్తున్నారు. అమెరికా, దేశంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ నటించిన చిత్రాలను స్పెషల్ షోలుగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లో సంబరాలు మిన్నంటేలా కనిపిస్తున్నాయి. జల్సా, తమ్ముడు సినిమాలకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ఫ్యాన్స్‌కు కిక్కెస్తున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉందంటే..

హైదరాబాద్‌లో భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో జల్సా సినిమా ప్రదర్శనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త సినిమాకు ముస్తాబు చేసినట్టుగా థియేటర్లను అభిమానులు కటౌట్స్, ఫ్లెక్సీలతో అలంకరిస్తున్నారు. మూడు రోజుల ముందుగానే అభిమానులు తోరణాలు, భారీ పోస్టర్లను కట్టడంలో తలమునకలై ఉన్నారు.

ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 17 షోలు

ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 17 షోలు


ఇక జల్సా సినిమాను హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2వ తేదీన భారీగా ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నారు. ప్రసాద్ మల్టీ ప్లెక్స్‌లో ఏకంగా 17 షోలు ప్రదర్శిస్తున్నారు. సంధ్య, సుదర్శన్, దేవీ థియేటర్లతోపాటు పలు మల్టీప్లెక్స్‌లో ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు.

82 శాతం అక్యుపెన్సీతో 45 లక్షలు

82 శాతం అక్యుపెన్సీతో 45 లక్షలు


హైదరాబాద్‌లో జల్సా సినిమా స్పెషల్ అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. మొత్తం 56 షోలు ప్రదర్శిస్తుండగా..అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 45 లక్షలు వసూలైంది. దాదాపు 82 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

పోకిరి రికార్డును బ్రేక్ చేసిన జల్సా

పోకిరి రికార్డును బ్రేక్ చేసిన జల్సా


హైదరాబాద్‌లో స్పెషల్ షోల విషయంలో జల్సా మూవీ రికార్డులు సృష్టించింది. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు జన్మదినం సందర్భంగా పోకిరి సినిమాను ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రదర్శించగా.. 6.9 లక్షల కలెక్షన్లు, ఒక్కడు సినిమాకు 8.16 లక్షల వసూళ్లు లభించాయి. అయితే జల్సా సినిమాకు ఏకంగా మూడు రోజుల ముందే 16.57 లక్షలు, తమ్ముడు సినిమాకు 13.69 లక్షల వసూళ్లను రాబట్టడం రికార్డుగా మారింది.

గుజరాత్‌లో కూడా స్పెషల్ షోలు


జల్సా స్పెషల్ షోను గుజరాత్‌లో కూడా ప్రదర్శించడం విశేషంగా మారింది. వడోదర లోని పరుల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెప్టెంబర్ 1వ తేదీ 10 గంటలకు ఐనాక్స్ తక్ష్ గెలాక్సీలో జల్సాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అమెరికాలో అడ్వాన్సు బుకింగ్

అమెరికాలో అడ్వాన్సు బుకింగ్


ఇక అమెరికాలో జల్సా స్పెషల్ షోలకు అభిమానులు పొటెత్తుతున్నారు. యూఎస్‌లో మొత్తం 28 లొకేషన్లలో షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా.. మొత్తం 876 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 8635 అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఇక పోకిరి సినిమాను 11 లొకేషన్లలో ప్రదర్శించగా 6135 డాలర్లను వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X