Cameraman Gangatho Rambabu: పవన్ రీరిలీజ్​ కలెక్షన్స్​.. ఈ 3 చిత్రాలకు దిమ్మతిరిగే రేంజ్​లో కోట్లు!

టాలీవుడ్​లో ఏ హీరోకు లేని క్రేజ్ పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ సొంతం. ఏ హీరోకు అయినా అభిమానులు ఉంటారు కానీ పవన్​ కల్యాణ్​కు మాత్రం భక్తులు ఉంటారు అన్న మాటలు కూడా మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లు అభిమానులు, ప్రేక్షకుల హంగామాతో హోరెత్తిపోతుంటాయి. ఇంకా చెప్పాలంటే హిట్టూ ఫ్లాపులకు అతీతమైన హీరో ఆయన. పరాజయాలు పలకరించినప్పుడు కూడా ఆయన మార్కెట్ స్థాయి తగ్గలేదు.

స్టార్‌డ‌మ్‌, క్రేజ్ మరింత పెరుగుతూనే వచ్చాయి. అయితే ఇప్పుడు రీరిలీజ్​ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్​లోనూ ఆయన సినిమాలకు క్రేజ్ అస్సలు తగ్గట్లేదు. థియేటర్లన్నీ నిండిపోతున్నాయి. ఈ సందర్భంగా పవన్ రీరిలీజ్​ సినిమాల కలెక్షన్స్​ వివరాలను తెలుసుకుందాం..

Pawan kalyan Kushi,Jalsa, Cameraman Gangatho Rambabu Re release movies collections Full Details Here

పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్​ తమ్ముడు నుంచి పవర్ స్టార్‌గా, అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. ఆయన నడక, చూపు, మాట.. ఇలా ప్రతి కదలికలో ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ముఖ్యంగా కంటిలోని మెరుపుకు ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో పవర్ స్టార్​గా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

అయితే వాస్తవానికి మొదల్లో పవన్​ నటించిన బద్రి, తమ్ముడు, ఖుషి వంటివి సరికొత్త ట్రెండ్ సృష్టించినా ఆ తర్వాత మాత్రం అలా అవ్వలేదు. చాలా వరకు ఆయన నటించిన ప్రతీ చిత్రం ఫ్లాప్​లుగా నిలిచాయి. కానీ ఇక్కడ విశేషమేమిటంటే ఫ్లాప్​లు వరుసగా పడితే ఎవరికైనా స్టార్ డమ్ తగ్గుతుంది. కానీ పవన్​కు అలా జరగలేదు. క్రేజ్​, ఫ్యాన్ ఫాలోయింగ్​ మరింత పెరుగుతూనే వచ్చింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్​ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్​, మహేశ్​, అల్లు అర్జున్​ ఇలా చాలా మంది కథానాయకుల సినిమాలు మళ్లీ విడుదలై మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. అలానే పవన్ కల్యాణ్ చిత్రాలు కూడా మళ్లీ థియేటర్లలో విడుదలై సందడి చేస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. అలా ఇప్పటివరకు ఆయన నటించిన జల్సా, ఖుషి, తొలి ప్రేమ, తమ్ముడు, గుడుంబ శంకర్, కెమెరా మెన్​ గంగతో రాంబాబు రీరిలీజ్ అయ్యాయి. రీసెంట్​గా కెమెరామెన్​ గంగతో రాంబాబు విడుదలై మంచి రెస్పాన్స్​ను అందుకుంది.

Pawan kalyan Kushi,Jalsa, Cameraman Gangatho Rambabu Re release movies collections Full Details Here

త్రివిక్రమ్​ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా రూ. 3.6 కోట్ల గ్రాస్​ వసూళ్లను అందుకుంది. ఎవర్​గ్రీన్ హిట్ ఖుషి అయితే రూ.7.8 కోట్లు గ్రాస్​ కలెక్షన్లను అందుకుని రికార్డ్​ క్రియేట్ చేసుకుంది. తొలి ప్రేమ చిత్రం రూ.1.8కోట్లను ఖాతాలో వేసుకుంది. గుడుంబ శంకర్ రూ.2.6 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక లేటెస్ట్ రీసెంట్ రీరిలీజ్​ కెమెరామెన్ గంగతో రాంబాబు రూ.3.56 కోట్లను సంపాదించింది. అన్నింటిలో ఖుషి రూ.7.8కోట్ల గ్రాస్​తో టాప్​ లో నిలిచింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, జల్సా చిత్రాలు మంచి వసూళ్లను అందుకున్నాయి.

ప్రస్తుతానికి పవన్​ ఓవైపు చిత్రాలతో మరోవైపు ఏపీ రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. ఏపీ ఎలెక్షన్స్​ దగ్గర పడడంతో తాత్కాలికంగా షూటింగ్​లకు గ్యాప్ ఇచ్చారు. ఆయన చేతిలో హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ హరిహర వీరమల్లు, సుజిత్ ఓజీ చిత్రాలు ఉన్నాయి. దీని తర్వాత త్రివిక్రమ్​తోనూ ఓ సినిమా ఉందని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X