‘గబ్బర్ సింగ్’ న్యూ రికార్డ్ గుంటూరు
పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం గుంటూరు సీటీలో నయా రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం గుంటూరులో కేవలం 46 రోజుల్లో రూ. కోటి షేర్ సాధించి నెం.1 స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు గుంటూరులో ఏ సినిమా కూడా ఈ రేంజిలో షేర్ సాధించిన దాఖలాలు లేవు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.
గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివరాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. బహుషా సినిమా బిజినెస్ మొత్తం పూర్తచయ్యాక ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం కలెక్షన్ల మ్యాజిగ్ పిగర్ తెలుసుకుని ఇతర హీరోల అభిమానుల ముందు కాలర్ ఎగరేయాలని ఉబలాట పడుతున్నారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' చిత్రం బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగిస్తూనే ఉంది. అంచనాలకు మించిన కలెక్షన్లతో నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. పవర్ స్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈచిత్రం మెగా అభిమానుల దాహాన్ని తీర్చింది. తాజాగా ఈ చిత్రం రికార్డు స్థాయి థియేటర్లలో 50 రోజుల దిశగా దూసుకెలుతోంది. ఈ చిత్రం పవర్ స్టార్‌తో పాటు దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ కెరీర్‌కి మంచి సపోర్టునిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











