OG OTT Business: ఓజి అఫీషియల్ డిజిటల్ డీల్ వాళ్ళకే.. కళ్ళు చెదిరేలా పాన్ ఇండియా బిజినెస్

రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి మంచి హైప్ ఉన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ లలో యూనానిమస్ గా ముందు లైన్ లో ఉండే సినిమా మాత్రం ఒకటి ఉందని చెప్పాలి. కాగా ఆ చిత్రమే పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ "ఓజి" అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు పవన్ చరిష్మాకి తగ్గట్టుగా ప్లాన్ చేయడంతో ఊహించని లెవెల్ హైప్ దీనిపై నెలకొంది.

కాగా నిజానికి ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లోనే రావాల్సి ఉంది కానీ సకాలంలో షూటింగ్ పనులు పూర్తి కాని నేపథ్యంలో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గానే ఉంది కానీ ఎప్పుడు వచ్చినా ఊచకోత ఖాయం అనే హైప్ ఈ సినిమా చుట్టూతా నెలకొంది. కాగా ఈ సినిమా రిలీజ్ కాకపోవడానికి గల కారణాల్లో అపుడు పవన్ ప్రధాన కారణం అని చాలా మంది అనుకున్నారు.

pawan kalyan official ott deal finished with a record

పవన్ ఆలస్యం వల్లే అంటూ తన మీదే పాయింట్ చేశారు. కానీ నిజానికి పవన్ తాను డేట్స్ ఇచ్చినప్పటికీ వారు వినియోగించుకోలేదని షాకిచ్చారు. మరి దీనిలో నిజం లేకపోలేదని చెప్పాలి. నిజానికి ఓజి సినిమా అప్పుడు విడుదల కాలేకపోయింది పవన్ కళ్యాణ్ వల్ల కాదు. అప్పుడు ఆ సినిమా ఓటిటి డీల్ ముగియపోకపోవడం వల్ల అని చాలా మందికి తెలియదు.

అందుకే మేకర్స్ సినిమా రిలీజ్ ని అప్పుడు హోల్డ్ చేయడం పవన్ డేట్స్ ఇచ్చినప్పటికీ వారు వాడుకోకపోవడంతో రిలీజ్ ఎలాగో ఆగింది కాబట్టి పవన్ రాజకీయ పనుల్లో పడ్డారు. ఇక ఇదిలా ఉండగా అప్పుడు ఓటిటి బడ్జెట్ సరిపోక ఓజి మేకర్స్ అనుకున్న ఫిగర్ రాకపోవడంతో "ఓజి" డీల్ పూర్తి కాలేదని రూమర్స్ వచ్చాయి. కానీ ఇపుడు ఫైనల్ ఓజి సినిమా డీల్ పూర్తయ్యింది.

pawan kalyan official ott deal finished with a record

అప్పుడు అనుకున్న భారీ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారే ఈ సినిమాని కొనేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ సినిమాని వారు మొత్తం పాన్ ఇండియా భాషల్లో కొనేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాకి డీల్ ఎంత వచ్చింది అనేది కూడా ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఓజి కోసం వారు ఏకంగా 120 కోట్లకి పైగానే ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో సౌత్ సినిమా దగ్గర ఇది మరో రికార్డు మొత్తం అన్నట్టుగా తెలుస్తుంది.

సో మొత్తానికి ఓజి సినిమా తాలుకా ఓటిటి డీల్ ఇలా ఎండ్ అయ్యింది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. ఆల్రెడీ పవన్ నుంచి మార్చ్ లో తన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు విడుదలకి సిద్ధంగా ఉంది. దీని తర్వాతే ఓజి వస్తుంది. ఈ డేట్ పై ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని RRR సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమా కూడా రెండు భాగాలుగా నిర్మాణం వహించబడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X