OG Box Office Day 1 Advance Collection: ఓజీ డే1 కలెక్షన్ల సునామీ.. గేమ్ ఛేంజర్‌ను దాటి రికార్డు స్థాయిలో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ గ్యాంగ్ స్టర్ చిత్రం THEY CALL HIM OG. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వరల్డ్ వైడ్ గా డే1 అడ్వాన్డ్స్ బుకింగ్స్ (ప్రీమియర్స్ + డే1) ద్వారా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..

ఓజీ మూవీ బడ్జెట్ ఎంత?
గ్యాంగ్ స్టర్ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ OGలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, రావు రమేశ్, రాహుల్ రవిచంద్రన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. టెక్నీకల్ సైడ్ రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చూడగా, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు + ప్రొడక్షన్ ఖర్చులు + ప్రచార వ్యవం కలుపుకొని OG సినిమాకు రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Pawan Kalyan OG Movie Day 1 Box Office Advance Collections

ప్రీ రిలీజ్ బిజినెస్?
OG చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కు వివరాల్లోకి వస్తే.. ఆంధ్రా రైట్స్ రూ.80 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, ఇక నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.55 కోట్లు కలుపుకొని తెలుగు రాష్ట్రాలో రూ.157 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక హక్కులు రూ.8 కోట్లు, తమిళం + కేరళలో హక్కులు రూ.3 కోట్లు, ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 2.9 మిలియన్ డాలర్లు, ఇండియన్ కరెన్సీలో రూ.25.5 కోట్లు వ్యాపారం జరిగింది. ఇలా మొత్తం కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కలుపుకొని ఇండియాలో భారీగానే ప్రీరిలీజ్ వ్యాపారం జరిగింది. మరోవైపు ఓవర్సీస్ లో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 4.5 మిలియన్ డాలర్లు సాధించాలని తెలుపుతున్నారు.

డే1 అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు..
OG చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది. ఇక OG చిత్రానికి ఉన్న హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూడా అదే స్థాయిలో వసూళ్లు అందుతున్నాయి. సెప్టెంబర్ 24 సాయంత్రం 6 గంటల వరకు OG సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు ఇలా ఉన్నాయి. ప్రీమియర్స్ + సెప్టెంబర్ 25వ రోజు డే1కి సంబంధించిన బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. తెలంగాణలో 2,525 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. 62 శాతం బుకింగ్స్ జరగడం విశేషం. దీంతో తెలంగాణలో రూ.24 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఏపీలో 3,955 షోలకు గానూ 57 శాతం బుకింగ్స్ జరిగాయి.

ఇలా ఏపీ మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.52 కోట్లు అందింది. కేవలం హైదరాబాద్ లోనే రూ.19 కోట్ల వసూళ్లు అందాయి. ఇక మిగితా రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, హిందీ, తెలంగాణ + ఏపీ కలుపుకొని ఇండియా మొత్తంగా 9,104 కోట్ల షోలకు గానూ రూ.60 కోట్ల వరకు వసూళ్లు జరిగాయి. ఓవర్సీస్ లో 35.5 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇలా వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.95.5 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక డే1 ఫైనల్ గా OG చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు అందుకునే అవకాశం ఉందని రిలీజ్ ముందు వరకే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X