OG Box Office: ఆ ఏరియాలో బాహుబలి 2 రికార్డ్ అవుట్.. పవన్ కల్యాణ్ OG ఎన్ని కోట్లతో బ్రేక్ చేసిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. పలు రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో డే1 ఈస్ట్ గోదావరిలో అందుకున్న వసూళ్లు ఆసక్తికరంగా మారాయి. ఆ ఏరియాలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి 2తో హ్యయేస్ట్ వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. తాజాగా OG చిత్రంతో పవన్ కళ్యాణ్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడం విశేషంగా మారింది. ఈ క్రమంలో ఓజీ సినిమా బడ్జెట్ ఎంత? ఏరియావైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈస్ట్ గోదావరిలో మొదటి రోజు ఎంత వసూల్ సాధించిందనే వివరాల్లోకి వెళితే..
ఓజీ చిత్రం బడ్జెట్ ఎంత?
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో OG చిత్రం రూపుదిద్దుకోవడం, స్టార్ కాస్ట్ ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించడం, రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించడం విశేషం. దీంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో గ్రాండ్ గా నిర్మించారు. కాగా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.250 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్?
థియేట్రికల్ రైట్స్ ద్వారా OG చిత్రానికి ఆంధ్రాలో రూ.80 కోట్లు, సీడెడ్‌లో రూ.22 కోట్లు, నైజాంలో రూ.55 కోట్లు కలుపుకొని తెలుగు రాష్ట్రాలో రూ.157 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళం + కేరళలో రూ.3 కోట్లు, నార్త్ అమెరికాలో 2.9 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.25.5 కోట్లు) ఇలా వరల్డ్ వైడ్‌గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ నిర్ణయించారు. ఇక డే1 రూ.167 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ ను వసూల్ చేయడం విశేషం.
ఈస్ట్ గోదావరిలో ఓజీ డే1 కలెక్షన్లు..
ఏపీలోని ఈస్ట్ గోదావరిలో టాలీవుడ్ స్టార్స్ పలు రికార్డులను సెట్ చేసి పెట్టారు. ఈ ఏరియాలో స్టార్ హీరోలు తమ సినిమాల కలెక్షన్లతో పోటీ పడుతుంటారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ OG చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఈస్ట్ గోదావరి ఏరియాలో డే1 హయ్యేస్ట్ వసూళ్లను రాబట్టారని, రూ.8.24 కోట్ల షేర్, రూ.16 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.
బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన OG..
ఈస్ట్ గోదావరి ఏరియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి 2తో ఓపెనింగ్ డే రూ.5.94 కోట్ల షేర్ ను వసూల్ చేసి టాప్‌లో ఉన్నారు. ఇదే ఏరియాలో RRR రూ.5.3 కోట్ల షేర్, పుష్ప 2 రూ.4.9 కోట్ల షేర్, గేమ్ ఛేంజర్ రూ.4.83 కోట్ల షేర్, దేవర రూ.4.79 కోట్ల షేర్ వసూల్ చేసి టాప్ 5లో ఉన్నాయి. ఇక పవన్ ఓజీ చిత్రం డే1 రూ.8.24 కోట్ల షేర్ వసూల్ చేసి బాహుబల 2 రికార్డును బ్రేక్ చేసి టాప్ లో నిలవడం సెన్సేషన్ గా మారింది.


Click it and Unblock the Notifications











