Jalsa special shows ట్రెండ్ సెట్ చేసిన పవన్ కల్యాణ్.. భారీ కలెక్షన్లతో పవర్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రిలీజ్ సమయంలో రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన జల్సా సినిమా మరోసారి రికార్డు కలెక్షన్లను రాబట్టింది. జల్సా స్పెషల్ షో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

700 లకుపైగా షోలు

700 లకుపైగా షోలు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జల్సా సినిమాను స్పెషల్ షోలుగా ప్రదర్శించేందుకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. భారీ స్పందన లభించింది. దాదాపు 700లకు పైగా స్క్రీన్లలో జల్సాను ప్రదర్శించారు

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు


తెలుగు రాష్ట్రాల్లో జల్సా మూవీ స్పెషల్ షో కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం 1.26 కోట్లు వసూలు చేయగా.. సీడెడ్‌లో 39 లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 లక్షలు, గుంటూరు జిల్లాలో 11 లక్షలు, కృష్ణా జిల్లాలో 22 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షలు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీ, నైజాంలో మొత్తంగా 2.57 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇతర రాష్ట్రాల్లో 22 లక్షలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల వసూళ్లను రాబట్టింది.

పోకిరి రికార్డును తుడిచిపెట్టిన జల్సా

పోకిరి రికార్డును తుడిచిపెట్టిన జల్సా


ఇటీవల సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని కూడా స్పెషల్ షోలుగా ప్రదర్శించారు. అయితే ఆ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 375 షోలు వేస్తే.. 1.73 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక జల్సా చిత్రాన్ని 700 పైగా షోలు వేస్తే.. 3.2 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ప్రభాస్ బర్త్ డే కోసం భారీగా ఏర్పాట్లు

ప్రభాస్ బర్త్ డే కోసం భారీగా ఏర్పాట్లు


తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ తమ అభిమాన కథానాయకుడు నటించిన చిత్రాలను స్పెషల్ షోలుగా ప్రదర్శించే అనవాయితీని ప్రారంభించారు. ఇప్పటికే మహేష్, పవన్ కల్యాణ్ నటించిన స్పెషల్ షోలు భారీగా ప్రదర్శించారు. ఈ క్రమంలో మహేష్ సాధించిన స్పెషల్ షోల కలెక్షన్ల కంటే పవన్ కల్యాణ్ రాబట్టిన వసూళ్లు భారీ రికార్డును క్రియేట్ చేశాయి. అక్టోబర్‌లో ప్రభాస్ బర్త్ డే ఉన్నందున యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మిర్చి సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X