వకీల్ సాబ్ బాక్సాఫీస్ ప్రభంజనం.. సరికొత్త చరిత్ర దిశగా పవన్ కల్యాణ్ మూవీ.. తొలి రోజు ఎంతంటే!
వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్దమైంది. తొలి రోజు మొదటి ఆట నుంచే పవన్ కల్యాణ్ చిత్రం సంచలన రీతిలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నది. అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత ఉండవచ్చంటే..
రాశీఖన్నా గ్లామరస్ పోటోషూట్... నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

వసూళ్ల గురించి ఆలోచించను...
వకీల్ సాబ్ వసూళ్ల గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. నాకు సినిమా తీయడమే తెలుసు. వసూళ్ల గురించి ఆలోచించను. సినిమానే కలెక్షన్ల గురించి మాట్లాడుతుంది. ఒకసారి ప్రభంజనం మొదలైన తర్వాత దానిని ఆపే తరం ఎవరికీ లేదు అంటూ దిల్ రాజు చెప్పారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో వకీల్ సాబ్ కలెక్షన్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి.

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి
నైజాంకు సినీ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో ఈ చిత్రం భారీగా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు దాదాపు 95 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. తొలి రోజు ఈ చిత్రం రూ.5.50 కోట్ల వసూలు చేసే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరుపై ఓ రికార్డు ఉంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.4.39 కోట్లు వసూలు చేసింది.

యూఎస్‌లో ఘనంగా
అమెరికాలో వకీల్ సాబ్ బాక్సాఫీస్ యాత్రను ఘనంగా ప్రారంభించింది. దాదాపు 226 లోకేషన్లలో ఈ చిత్రం 297k డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత అత్యధికంగా వసూళ్లను సాధించిన ఇండియన్ ప్రీమియర్‌గా ఓ రికార్డు సొంతం చేసుకొన్నది. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రం $364k వసూలు చేసినట్టు తెలిసింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో
అంతేకాకుండా వకీల్ సాబ్ చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 58 లొకేషన్లలో 145,079 ఆస్టేలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే న్యూజిలాండ్‌లో భారీ వసూళ్లను నమోదు చేసింది. 17 లోకేషన్లలో ఈ చిత్రం 8302 న్యూజిలాండ్ డాలర్లను కలెక్ట్ చేసింది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే
ఇక ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసే విధంగా జర్నీని మొదలుపెట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. పవన్ కల్యాణ్ చిత్రం 32 కోట్లకుపైగా షేర్ సాధించే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇదే కాకుండా ఏపీ, నైజాంలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











