Vakeel Saab Day 2 collections: ఇండియాలో సరికొత్త రికార్డు.. ఆ హీరో రికార్డును బ్రేక్ చేసిన పవర్ స్టార్
కోవిడ్ 19 పరిస్థితుల్లో ప్రపంచంలోని పలు దేశాల్లో విడుదలైన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆఢిస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. తొలి రోజున 39 కోటల్ నికర వసూళ్లను, రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. అయితే రెండో రోజు ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందనే అంచనా విషయానికి వస్తే..

మాస్టర్ రికార్డులను తిరగరాసిన వకీల్ సాబ్
కరోనావైరస్ మహ్మమ్మారి కారణంగా థియేటర్లు మూతపడి మళ్లీ తెరుచుకొన్న తర్వాత అతిపెద్ద సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీ, తెలంగాణలోనే ఈ చిత్రం రూ.35 కోట్ల నికరవసూళ్లను సాధించింది. ఈ మధ్య కాలంలో అతిపెద్ద ఓపెనర్‌గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. విజయ్ నటించిన మాస్టర్ సినిమా కలెక్షన్లను అధిగమించింది

అమెరికాలో రెండో రోజు
అమెరికాలో ఒక రోజు ముందుగానే విడుదలైన వకీల్ సాబ్ ప్రీమియర్‌తోపాటు రెండు రోజుల్లో 507,630 డాలర్లను వసూలు చేసింది. ప్రీమియర్ల ద్వారా 301,456 డాలర్లు, తొలి రోజును 154,013 డాలర్లు, రెండో రోజు అక్కడి కాలమానం ప్రకారం పదిగంటల సమయంలో 52,161 డాలర్లు వసూలు చేసింది.

రెండో రోజును వకీల్ సాబ్ అదే ఊపు
ఇక రెండో రోజు కూడా అదే ఊపును వకీల్ సాబ్ కొనసాగిస్తున్నది. హైదరాబాద్‌లో 875 షోలు, వైజాగ్‌లో 200 షోుల, విజయవాడలో 138 షోలు, నెల్లూరులో 52 షోలు, గుంటూరులో 36 షోలు, కాకినాడలో 37 షోలు, వరంగల్‌లో 59 షోలను ప్రదర్శిస్తున్నారు. ప్రతీ ప్రాంతంలో కూడా 85 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది.

వైజాగ్, విజయనగరం, అనకాపల్లిలో
వకీల్ సాబ్ చిత్రం రెండో రోజున వైజాగ్ సిటీలోని జగదాంబ, రమాదేవి, శ్రీ మెలోడి, శ్రీ వెంకటేశ్వర, వెంకటేశ్వర, జ్యోతి, శ్రీకన్య, సంగం, శరత్, శ్రీ రామా, కిన్నెర, కామేశ్వరి థియేటర్లలో హౌస్ కలెక్షన్లను నమోదుచేసింది. విజయనగరం, నర్సనపేట, బొబ్బిలి, అనకాపల్లిలో కూడా ఫుల్ అక్యుపెన్సీతో రన్ అవుతున్నది. హైదరాబాద్‌లోని సంధ్య 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం, దేవీ 70 ఎంఎం, సంధ్య 35ఎంఎం, శాంతి, సప్తగిరి, సాయిరాజ థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి.
Recommended Video

వకీల్ సాబ్ రెండో రోజు వసూళ్ల అంచనా
తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ సెంటర్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వకీల్ సాబ్ చిత్రం రెండో రోజున కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం రెండో రోజున రూ.30 నుంచి 35 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











