Vakeel Saab Day 4 కలెక్షన్లు.. ఇండియాలోనే టాప్‌ రికార్డు... ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం టాలీవుడ్‌లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. వారాంతం తర్వాత, కరోనావైరస్ పరిస్థితుల్లో కూడ ది బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది. దీంతో 100 కోట్ల రూపాయల క్లబ్‌కు ఈ చిత్రం చేరువైంది. అనేక ప్రతికూలతలను ఎదిరిస్తూ లాక్‌డౌన్ తర్వాత ఇండియాలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ దూసుకెళ్తున్నది. 4వ రోజు ఈ చిత్రం సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే...

ఆకాంక్ష శర్మ.. ఓ వైపు ట్రెడిషినల్ లుక్ మరోవైపు హాట్ లుక్

 వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.89.35 కోట్ల బిజినెస్ చేసింది. నైజాం హక్కులు రూ.25.2 కోట్లు, సీడెడ్ రూ.13.4 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.10.9 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.6.3 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.6.3 కోట్లు, గుంటూరు రూ. 7.6 కోట్లు, కృష్ణా జిల్లా రూ.6.5 కోట్లు, నెల్లూరు రూ.3.35 కోట్లతో మొత్తంగా రూ.80.35 కోట్లు బిజినెస్ చేసింది. కర్ణాటకలో రూ.4 కోట్లు, ఓవర్సీస్ రూ.5 కోట్లతో మొత్తంగా 89.35 కోట్ల బిజినెస్ నమోదు చేసింది.

 వకీల్ సాబ్ 4వ రోజు కలెక్షన్లు

వకీల్ సాబ్ 4వ రోజు కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ చిత్రం తొలి రోజున రూ.7 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. నైజాంలో ఈ చిత్రం రూ.1.12 కోట్లు, సీడెడ్‌లో రూ.81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 96 లక్షలు రాబట్టింది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.31 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.22 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.31 లక్షలు, నెల్లూరులో రూ.14 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 మొత్తం 4 రోజుల వసూళ్లు

మొత్తం 4 రోజుల వసూళ్లు

ఇక వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన మొత్తం నాలుగు రోజులు వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో ఇప్పటి వరకు ఈ చిత్రం 17.42 కోట్లు, సీడెడ్‌లో రూ.8.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.66 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.4.93 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ చిత్రం రూ.5.82 కోట్లు, గుంటూరులో రూ.5.58 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.3.56 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.2.63 కోట్లు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ రాబడి

ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ రాబడి

వకీల్ సాబ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.57.56 కోట్లు నికరంగా, 86.7 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలో రూ.3.23 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం రూ.3.52 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.64.21 కోట్లు నికరంగా.. రూ.98.45 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

వకీల్ సాబ్ ప్రాఫిట్‌లోకి రావాలంటే

వకీల్ సాబ్ ప్రాఫిట్‌లోకి రావాలంటే

ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ చిత్రం రూ.88 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ చిత్రం రూ.90 కోట్ల మేర వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు రూ.64 కోట్లు రాబట్టిందున.. ఈ సినిమా హిట్ టాక్ నమోదు చేయాలంటే.. బాక్సాఫీస్ వద్ద మరో రూ.25 కోట్లు రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X