For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vakeel Saab Day 7 collections: షాకింగ్‌గా బాక్సాఫీస్ వసూళ్లు.. ఏపీ, నైజాంలో ఆ గడ్డు పరిస్థితుల మధ్య..

    |

    తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. టికెట్ రేట్లపై ఏపీ సర్కార్ ఆంక్షలు విధించినా ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా లక్ష్యం రూ.150 కోట్ల క్లబ్‌వైపుగా టార్గెట్ సెట్ అయింది. అయితే ఈ సినిమా 7వ రోజున ఏ రేంజ్‌ వసూళ్లను సాధించే అవకాశం ఉందనే విషయంలోకి వెళితే...

    .

    ప్రియాంక చోప్రా.. ఇంతకంటే హాట్ షో మరొకటి ఉండదేమో

    ప్రతికూల పరిస్థితుల మధ్య వకీల్ సాబ్

    ప్రతికూల పరిస్థితుల మధ్య వకీల్ సాబ్

    తెలంగాణలో కరోనావైరస్ పరిస్థితులు ఓ వైపు ప్రమాదకరంగా మారడం, అలాగే ఏపీ సర్కార్ టికెట్ల రేట్లు పెంపుపై ఉక్కుపాదం మోపడం అలాగే బెన్‌ఫిట్, ప్రీమియర్ షోలను రద్దు చేయడంతో వకీల్ సాబ్‌ కలెక్షన్లకు గండి పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అలాంటి వాదనలకు చెక్ చెప్పి భారీ, రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

     6వ రోజున భారీగానే వసూళ్లు

    6వ రోజున భారీగానే వసూళ్లు

    ఇలాంటి పరిస్థితుల్లో 6వ రోజున వకీల్ సాబ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.72.95 కోట్లు నికరంగా, రూ.113.5 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఆరో రోజున ఊహించినంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది. దాదాపు 40 శాతం మేరకు కలెక్షన్లు క్షీణించాయి.

    ఏపీ, నైజాంలో తగ్గిన అక్యుపెన్సీ

    ఏపీ, నైజాంలో తగ్గిన అక్యుపెన్సీ

    అయితే ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఏపీ, నైజాంలో ఈ సినిమా కలెక్షన్లు 7వ రోజున అంతంత మాత్రంగానే ఉన్నాయిని చెబుతున్నారు. వైజాగ్, ఉత్తరాంధ్ర, సీడెడ్ మినహాయిస్తే మిగితా ప్రాంతాల్లో అక్యుపెన్సీ రేటు సుమారు 50 శాతంపైగా ఉందని వెల్లడిస్తున్నారు.

    అమెరికాలో సాధారణంగా టికెట్లు రేట్లు

    అమెరికాలో సాధారణంగా టికెట్లు రేట్లు

    ఇక ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. అమెరికాలో టికెట్ రేటు పెంపు బుధవారంతో ముగియనున్నది. గురువారం నుంచి సాధారణ టికెట్ రేట్లు అమల్లోకి వస్తాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొంత అక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో భారీ స్థాయిలో రెస్సాన్ లేదనే విషయం తెలుస్తున్నది.

    7వ రోజు వకీల్ సాబ్ టికెట్ల అంచనా

    7వ రోజు వకీల్ సాబ్ టికెట్ల అంచనా

    ఇక బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ సినిమా జోరు చూస్తే.. 7వ రోజు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో భారీగా కలెక్షన్లు క్షీణించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ చిత్రం రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల మధ్య వసూళ్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    English summary
    Vakeel Saab Day 7 expected collections: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Fimibeat Telugu brings Day 7 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X