Vakeel Saab Day 1 Collections: చరిత్ర సృష్టించిన ‘వకీల్ సాబ్’.. ఒక్క రోజుకే అంతా.. ఇదేం అరాచకం సామీ

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. దాదాపు ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో సినిమాలకు దూరమయ్యాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అంటూ రీఎంట్రీ ఇచ్చాడు పవన్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను అందుకుంది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లనూ రాబడుతోంది. దీంతో మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తద్వారా ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసింది. ఈ మూవీ రిపోర్టు మీకోసం!

అలా వెళ్లిపోయాడు.. ఇలా రీఎంట్రీ ఇచ్చేశాడు

అలా వెళ్లిపోయాడు.. ఇలా రీఎంట్రీ ఇచ్చేశాడు

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు.

అన్ని చోట్లా అదే టాక్... పవర్ స్టార్ ఈజ్ బ్యాక్

అన్ని చోట్లా అదే టాక్... పవర్ స్టార్ ఈజ్ బ్యాక్

'వకీల్ సాబ్' మూవీ నైజాంలో 354, సీడెడ్‌లో 220, ఆంధ్రాలో 600, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 300, ఓవర్సీస్‌లో 700లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2174 థియేటర్లలో విడుదల అయింది. మరికొన్ని చోట్లా ఇది స్పెషల్‌గా వేశారు. ఇక, అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిత్రం పవన్ కల్యాణ్‌కు పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్ అని అంతా అంటున్నారు.

భారీ అంచనాలు.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

భారీ అంచనాలు.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

'వకీల్ సాబ్'కు నైజాంలో రూ. 25.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.40 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.10 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.30 కోట్లు, గుంటూరులో రూ. 7.60 కోట్లు, కృష్ణాలో రూ. 6.50 కోట్లు, నెల్లూరులో రూ. 3.35 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్ రూ. 5 కోట్లతో మొత్తంగా రూ. 89.35 కోట్లు వ్యాపారం జరిగింది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

ఫస్ట్ డే 'వకీల్ సాబ్'కు పాజిటివ్ టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.10 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.50 కోట్లు, గుంటూరులో రూ. 3.94 కోట్లు, కృష్ణాలో రూ. 1.90 కోట్లు, నెల్లూరులో రూ. 1.70 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 32.24 కోట్లు షేర్, రూ. 44 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?


తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 32.24 కోట్ల కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది 'వకీల్ సాబ్'. అదే సమయంలో మిగిలిన ప్రాంతాల్లోనూ అదిరిపోయే స్పందనను అందుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 36.46 కోట్లు షేర్‌తో పాటు రూ. 52.40 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలైంది ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలైంది ఎంత?


'వకీల్ సాబ్' సినిమాకు మొత్తంగా రూ. 89.35 కోట్లు వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. అయితే, మొదటి రోజే ఈ చిత్రం దాదాపు రూ. 36.46 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 53.54 కోట్లు రాబట్టాలి. లాంగ్ అండ్ ఫెస్టివల్ వీకెండ్ కావడంతో ఈ టార్గెట్ రెండు మూడు రోజుల్లో ఫినీష్ అయ్యే అవకాశం ఉంది.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
మొదటి రోజు రిపోర్టు ఇలా.. రికార్డులు బద్దలు

మొదటి రోజు రిపోర్టు ఇలా.. రికార్డులు బద్దలు

మొదటి రోజే 'వకీల్ సాబ్' మూవీ హవా కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ షేర్ సాధించిన సినిమాల జాబితాలో ఇది ఐదో స్థానానికి చేరుకుంది. అలాగే, హైర్స్‌ లేకుండా ఎక్కువ షేర్ సాధించిన చిత్రాల లిస్టులో రెండో స్థానానికి వెళ్లింది. నైజాంలో ఎక్కువ రాబట్టిన చిత్రాల్లో మూడో స్థానానికి.. సీడెడ్‌లో ఏడో స్థానానికి చేరుకుంది. మొత్తానికి పదుల సంఖ్యలో రికార్డులను బద్దలు కొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X