Vakeel Saab 5 days Collections: పండుగ రోజు ‘వకీల్ సాబ్’ రికార్డు.. ఏకంగా డబుల్ ఫిగర్‌తో పవన్ హవా
వకీల్ సాబ్.. వకీల్ సాబ్.. వకీల్ సాబ్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ మేనియా కనిపిస్తోంది. దీనికి కారణం ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కావడమే. దాదాపు మూడేళ్ల తర్వాత సినీ రంగంలోకి అడుగు పెడుతోన్న అతడు.. విడుదలకు ముందు నుంచే అంచనాలను పెంచేశాడు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసి.. సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్లు కూడా దుమ్ము దులిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ రోజు 'వకీల్ సాబ్' రికార్డు క్రియేట్ చేశాడు. ఆ మూవీ బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

‘వకీల్ సాబ్'గా మారాడు.. కమ్‌బ్యాక్ అయ్యాడు
లాంగ్ గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాలు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
'వకీల్ సాబ్'కు నైజాంలో రూ. 25.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.40 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 10.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7.10 కోట్లు, వెస్ట్‌లో రూ. 6.30 కోట్లు, గుంటూరులో రూ. 7.60 కోట్లు, కృష్ణాలో రూ. 6.50 కోట్లు, నెల్లూరులో రూ. 3.35 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్ రూ. 5 కోట్లతో మొత్తంగా రూ. 89.35 కోట్లు వ్యాపారం జరిగింది.

ఐదవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతొచ్చిందంటే?
ఐదో రోజైన ఉగాది నాడు 'వకీల్ సాబ్'కు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.12 కోట్లు, ఈస్ట్‌లో రూ. 54 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 28 లక్షలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.30 కోట్లు షేర్, రూ. 14 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఐదు రోజులకు కలిపి ఎంత వసూలు చేసింది?
టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా 'వకీల్ సాబ్' మూవీకి మంచి కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 32.24 కోట్లు, రెండో రోజు రూ. 10.74 కోట్లు, మూడో రోజు రూ. 10.39 కోట్లు, నాలుగో రోజు రూ. 4.19 కోట్లు, ఐదో రోజు రూ. 8.30 కోట్లు వసూలు చేసింది. తద్వారా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 65.80 కోట్లు షేర్, రూ. 100.70 కోట్ల గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఏ రేంజ్‌లో?
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 65.80 కోట్ల కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది 'వకీల్ సాబ్'. అదే సమయంలో మిగిలిన ప్రాంతాల్లోనూ అదిరిపోయే స్పందనను అందుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.61 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 72.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 113.35 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలైంది ఎంత?
'వకీల్ సాబ్'కు మొత్తంగా రూ. 89.35 కోట్లు వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. అయితే, ఐదు రోజులకు ఈ చిత్రం దాదాపు రూ. 72.95 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలంటే మరో రూ. 17.05 కోట్లు రాబట్టాలి. సినిమా టాక్ బాగుండడంతో పాటు ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో టార్గెట్ వారంలోనే రీచ్ అవ్వొచ్చు.
Recommended Video

‘వకీల్ సాబ్' రికార్డు.. ఏకంగా డబుల్ ఫిగర్‌తో
నాలుగో రోజైన సోమవారం రూ. 4.19 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'వకీల్ సాబ్'.. ఉగాది పండుగ రోజైన మంగళవారం ఏకంగా దానికి రెట్టింపుగా రూ. 8.30 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో వంద కోట్ల గ్రాసును కూడా అందుకుంది. అదే ఇప్పుడు టికెట్ రేట్లు ముందులాగే ఉండి ఉంటే ఈ కలెక్షన్లు 25 శాతం మరింత ఎక్కువగా వచ్చేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











