Vakeel Saab Day 14 collections.. 90 కోట్లు పెడితే.. ఎంత లాభం? ఎంత నష్టం?
తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటన్న వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా చేతులెత్తేసింది. తొలివారంలో రికార్డు దిశగా దూసుకెళ్లినట్టు కనిపించినా ఆ తర్వాత తన దూకుడును తగ్గించింది. సినీ విమర్శకులు, మహిళా లోకం ఈ సినిమాకు జైకొట్టినా కరోనావైరస్ పరిస్థితులు కారణంగా ఈ సినిమా వసూళ్లు పరంగా తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో 14వ రోజున ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే..

14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో
వకీల్ సాబ్ చిత్రం 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లను నమోదు చేసింది. నైజాంలో రూ.5 లక్షలు, సీడెడ్‌లో రూ.2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.2 లక్షలు, తూర్పు గోదావరి రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.4 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.2.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.2.5 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.1.2 లక్షలు వసూలు చేసింది.

మొత్తం 14 రోజుల కలెక్షన్లు
వకీల్ సాబ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గత 13వ రోజుల్లో రూ.78.04 కోట్ల షేర్, రూ.120.48 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 14వ రోజున ఈ చిత్రం 22 లక్షల షేర్‌ను రూ.36 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ముందు కూడా వసూళ్లను రాబట్టే అవకాశమే కనిపించడం లేదనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఓవర్సీస్‌లో ఎంత నష్టమంటే
ఇక వకీల్ సాబ్ ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లను చూస్తే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.3.66 కోట్ల షేర్, ఓవర్సీస్‌లో రూ.5 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్‌కు కేవలం రూ.3.79 కోట్లు రాబట్టింది. దీంతో ఓవర్సీస్‌లోను, కర్ణాటకలోనూ ఈ చిత్రం భారీ నష్టాలను డిస్ట్రిబ్యూటర్లకు మిగిల్చింది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఇవే..
ఇక ప్రపంచవ్యాప్తంగా వకీల్ సాబ్ రూ.85.71 కోట్ల షేర్, రూ.136.95 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. వాస్తవానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.90 కోట్ల మేర చేసింది. సవరించిన లెక్కల ప్రకారం దాదాపు 95 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని కూడా అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











