Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్‌డౌన్ తర్వాత అరుదైన రికార్డు
వకీల్ సాబ్ చిత్రం ఐదో రోజున టాలీవుడ్‌లో మరో మైలురాయిని అధిగమించింది. లాక్‌డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రంగా రికార్డును అధిగమించింది. లాక్‌డౌన్ తర్వాత కుదేలైన చిత్ర పరిశ్రమలో తొలి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ ఓ రికార్డును అందుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ బలంగా ఉన్నప్పటికీ ఈ చిత్రం అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది.
బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న ఇషా ఛబ్రా

అమెరికాలో నిలకడగా
అమెరికాలో వకీల్ సాబ్ భారీ కలెక్షన్లను నమోదు చేసింది. ప్రీమియర్ల ద్వారా 301k డాలర్లు, తొలి రోజున 154k డాలర్లు, రెండో రోజున 114k డాలర్లు, మూడో రోజున 72k డాలర్లు, నాలుగో రోజున 14k డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 685k డాలర్లు అంటే రూ.5.10 కోట్లు వసూలు చేసింది. ఐదో రోజున కూడా మోస్తారు వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం.

ఆంధ్రా, తెలంగాణలో భారీగా
గత నాలుగు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజున రూ.32.24 కోట్ల షేర్, రెండో రోజున రూ.10.74 కోట్ల షేర్, మూడో రోజున రూ.10.39 కోట్లు, నాలుగో రోజున రూ.4.19 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో దాదాపు రూ.60 కోట్లు రాబట్టింది.

5వ రోజున 75 కోట్ల షేర్
ఇక వకీల్ సాబ్ చిత్రం 5వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల షేర్ సాధిస్తుందనే అంచనాలను ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి. పవన్ కల్యాణ్ తన కెరీర్‌లో 75 కోట్లు వసూలు చేయడం ఇది రెండోసారి అవుతుంది. ఇంకో 15 కోట్లు రాబట్ట గలిగితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.

5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో
ఏపీలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో తిరుపతిలో 5వ రోజు అన్ని షోలు హౌస్ ఫుల్ అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే అనంతపురంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఏపీలో మిగితా చోట్ల కూడా అన్ని షోలు ఫుల్ అయినట్టు సమాచారం అందుతున్నది. ఏలూరు సిటీలో కూడా ఉదయం, మ్యాట్నీ, ఫస్ట్ షోలు కూడా ఫుల్ అయినట్టు తెలిసింది.

5వ రోజు కలెక్షన్ల అంచనా..
ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ రిలీజైన ఐదో రోజున ఉగాది పండుగ రావడంతో సినిమాకు అదనంగా కలిసి వచ్చే అవకాశంగా మారింది. 5వ రోజున ఈ చిత్రం నైజాంతోపాటు ఏపీలో హౌస్‌ఫుల్‌తో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఈ చిత్రం 5వ రోజున రూ.15 నుంచి రూ.20 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











