Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్‌చల్

వకీల్ సాబ్ చిత్రం 6వ రోజున ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతున్నది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత దేశంలో విడుదలైన అన్ని చిత్రాలతో పోల్చితే వకీల్ సబ్ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక 6వ రోజు వకీల్ సాబ్ కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

 నైజాంలో 25 కోట్ల మార్కును

నైజాంలో 25 కోట్ల మార్కును


వకీల్ సాబ్‌కు సంబంధించి గత ఐదు రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో ఈ చిత్రం రూ.25 కోట్ల మార్కును సాధించింది. అలాగే సీడెడ్‌లో రూ.10 కోట్ల మార్కును అవలీలగా అధిగమించింది. ఉత్తరాంధ్రలో కూడా అదే ఊపును కొనసాగించి రూ.10 కోట్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

100 కోట్ల మైలురాయిని అధిగమించి

100 కోట్ల మైలురాయిని అధిగమించి

లాక్‌డౌన్ తర్వాత వకీల్ సాబ్ చిత్రం భారీ రేంజ్‌లో రిలీజై సరికొత్త రికార్డులు నమోదు చేసింది. కరోనావైరస్ పరిస్థితుల సమయంలో రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడమే కాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో 90 శాతం రికవరీని సాధించింది.

ఆంధ్రా, తెలంగాణలో ధమాకా

ఆంధ్రా, తెలంగాణలో ధమాకా

వకీల్ సాబ్ చిత్రం ఐదో రోజున ఆంధ్రా, తెలంగాణలో రూ.8.30 కోట్ల నికరంగా, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక మంచి చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తే.. కరోనా లాంటి మహమ్మారి ఏమీ చేయలేదని నిరూపించింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 అమెరికాలో నిలకడగా

అమెరికాలో నిలకడగా

అమెరికాలో వకీల్ సాబ్ చిత్రం నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. మంగళవారం రోజున 160 లొకేషన్లలో ఈ చిత్రం 16980 డాలర్లను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 702641 డాలర్లను వసూలు చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో కూడా మోస్తారు వసూళ్లను రాబడుతున్నదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఏపీలో 6వ రోజు హౌస్‌ఫుల్స్

ఏపీలో 6వ రోజు హౌస్‌ఫుల్స్


ఇక వకీల్ సాబ్ చిత్రం 6వ రోజున ఏపీలోని పలు ప్రాంతాల్లో మంచి వసూళ్లను రాబడుతున్నట్టు సమాచారం. ఏలూరు సిటీలో ఈ చిత్రం అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేసింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు అదనంగా రెండు థియేటర్లను పెంచడం జరిగిందనే విషయం తెలిసింది. అనకాపల్లిలో కూడా అదే జోరు కనిపించింది. వైజాగ్ సిటీలో అన్ని థియేటర్లో 95 శాతానికి పైగా ఆక్యుపెన్సీ కనిపించింది.

Recommended Video

#VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
వకీల్ సాబ్ 6వ రోజు కలెక్షన్ల అంచనా

వకీల్ సాబ్ 6వ రోజు కలెక్షన్ల అంచనా

ఇక ఏపీ, నైజాం, కర్ణాటక, ఓవర్సీస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్‌ 6వ రోజున కూడా మంచి వసూళ్లను నమోదు చేయనున్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా ఏపీలోని ప్రధాన పట్టణాల్లో 6వ రోజున భారీగా కలెక్షన్లతోపాటు హౌస్‌పుల్స్ కనిపించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో 6వ రోజున ఈ చిత్రం రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X