Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vakeel Saab 7 days collections: బాక్సాఫీస్ వద్ద భారీ దెబ్బ.. నష్టాలను పూడ్చుకోవాలంటే..
భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9వ తేదీన రిలీజైన వకీల్ సాబ్ చిత్రం వారం రోజులపాటు వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి రికార్డులు తిరగరాసింది. అయితే తొలి వారం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. 7వ రోజున పవన్ కల్యాణ్ ఎంత మొత్తం వసూలు చేశాడంటే..
పాయల్ రాజ్ పుత్.. Rx100 కంటే హై రేంజ్ గ్లామర్
భారీగా క్షీణించిన వసూళ్లు
వకీల్ సాబ్ చిత్రం 7వ రోజున ట్రేడ్ అంచనాలను చేరుకోలేకపోయింది. గత కలెక్షన్లతో పోల్చుకొంటే భారీగా వసూళ్లు క్షీణించాయి. ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద గణాంకాలను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను షాక్ గురించి చేసింది.
కరోనావైరస్ కేసులతో
వకీల్ సాబ్ కలెక్షన్లు భారీగా క్షీణించడానికి అసలు కారణం తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోవడమే. ప్రధానంగా ఆంధ్రా ప్రాంతంలో దాదాపు 5 వేలకుపైగా కేసులు నమోదు కావడంతో ప్రేక్షకులు థియేటర్లో అడుగుపెట్టడానికి జంకుతున్నారు అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున రాబడి
ఇలాంటి పరిస్థితుల్లో వకీల్ సాబ్ చిత్రం 7వ రోజున ఏపీ, నైజాంలో రూ.1.59 కోట్ల నికర, రూ.2.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో ఈ చిత్రం రూ.56 లక్షలు, సీడెడ్‌లో రూ.24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.27 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.14 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 లక్షలు, గుంటూరులో రూ.14 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.9 లక్షలు, నెల్లూరులో రూ.7 లక్షలు వసూలు చేసింది.
7 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..
గత ఏడు రోజుల వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లను చూస్తే.. ఏపీ, నైజాంలో రూ.72.28 కోట్లు నికరంగా, రూ.110.80 కోట్ల స్థూల వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో రూ.3.56 కోట్లు, ఓవర్సీస్లో రూ.3.67 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.79.51 కోట్ల షేర్, రూ.126.26 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
Recommended Video
నష్టాలను పూడ్చుకోవాలంటే..
ఇక వకీల్ సాబ్ చిత్రం సుమారు 90 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత కలెక్షన్లను బేరిజు వేసుకొంటే ఈ చిత్రం రూ.10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.