Vakeel Saab Day 8 collections: బాక్సాఫీస్ అంచనాలు తలకిందులు.. రెండోవారం పరిస్థితి ఏమిటంటే
వకీల్ సాబ్ చిత్రం రెండో వారంలో కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కరోనావైరస్ పరిస్థితులను తట్టుకొని రికార్డు వసూళ్లను నమోదు చేసింది. అయితే రెండో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం భారీగా కాకుండా ఓ మోస్తారు వసూళ్లను రాబడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన వివరాలు, రికార్డుల గురించి మరింత సమాచారం మీ కోసం..

లాక్‌డౌన్ తర్వాత రెండో మూవీగా
దేశంలో కోవిడ్ 19 కారణంగా విధించిన లాక్‌డౌన్ అనంతరం ఓపెనింగ్ వీక్‌లో భారీ కలెక్షన్లను రాబట్టిన రెండో చిత్రంగా వకీల్ సాబ్ మూవీ ఓ ఘనతను సాధించింది. మాస్టర్ చిత్రం రూ. 150 కోట్లు వసూలు చేయగా, వకీల్ సాబ్ రూ.109 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఉప్పెన రూ.65.2 కోట్లు, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం రూ.43.7 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్‌లో టాప్ 5 జాబితాలో
ప్రతికూల పరిస్థితుల్లో కూడా వకీల్ సాబ్ చిత్రం సీడెడ్‌లో మంచి వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో ఈ చిత్రం ఇప్పటి వరకు సాధించిన టాప్ వసూళ్లలో ఐదో స్థానంలో నిలిచింది. మొదటి వారంలో బాహుబలి2 చిత్రం 20.27 కోట్లు సాధిస్తే.. సైరా చిత్రం రూ.15 కోట్లు, అల వైకుంఠపురంలో రూ.13.5 కోట్లు, బాహుబలి1 చిత్రం రూ.12.12 కోట్లు వసూలు చేసింది. ఇక పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ రూ.11.70 కోట్లను రాబట్టింది.

రెండోవారంలో థియేటర్ల సంఖ్య
వకీల్ సాబ్ చిత్రం ఏపీ, నైజాంలో రెండోవారంలో మొత్తంగా 650కి పైగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. నైజాంలో ఈ చిత్రం 227 థియేటర్లలో, సీడెడ్‌లో 115 థియేటర్లలో, ఆంధ్రాలో 310 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. తొలివారం రికార్డు స్థాయిలో అత్యధిక హాళ్లలో ఈ సినిమాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

8వ రోజున కలెక్షన్లు ఇలా..
అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా 8వ రోజు భారీగా వసూళ్లను రాబట్టింది. 8వ రోజున ఈ చిత్రం నైజాంలో రూ.38 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.22 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 లక్షలు, గుంటూరులో రూ.8 లక్షలు, నెల్లూరులో రూ.4 లక్షలు వసూలు చేసింది. ఇక కృష్ణాలో రూ. 9.30 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో కృష్ణా జిల్లాలో మొత్తంగా రూ.4.26 కోట్లు వసూలు చేసింది. లాక్‌డౌన్ తర్వాత అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా వకీల్ సాబ్ నిలిచింది.

8 రోజులు వసూళ్లు ఇలా
వకీల్ సాబ్ కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే.. తొలి రోజున రూ.32.24 కోట్ల షేర్, రెండో రోజున రూ.10.74 కోట్లు, మూడో రోజున రూ.10.39 కోట్లు, నాలుగో రోజున రూ.4.19 కోట్లు, 5వ రోజున రూ.8.30 కోట్లు, ఆరో రోజున రూ.4.83 కోట్లు, ఏఢో రోజున రూ.1.59 కోట్లు, 8వ రోజున రూ.1.12 కోట్లు షేర్ వసూలు చేసింది.
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల కలెక్షన్లు
వకీల్ సాబ్ 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.73.40 కోట్లు, రూ.112.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.3.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.69 కోట్లు కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.80.27 కోట్లు, రూ.128.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.


Click it and Unblock the Notifications











