Bro 10 Days Collections: ఒక్కసారి భారీగా పెరిగిన కలెక్షన్స్.. అయినా వచ్చింది ఇంతే.. హిట్ కష్టమే బ్రో
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో అందరి దృష్టి తెచ్చుకున్న సినిమాల్లో బ్రో (BRO Movie)ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ ను సముద్ర ఖని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. కానీ, తమకు మాత్రం థియేటర్లలో అరుపులు, గోలలు మాత్రమే వినిపిస్తున్నాయని ఇటీవల సముద్ర ఖని అన్నారు. ఇదిలా ఉంటే 9వ రోజు నుంచి జోరందుకున్న బ్రో కలెక్షన్స్ 10వ రోజున ఎంతవరకు రాబట్టిందనే గణాంకాలు చూద్దాం.
ప్రతిష్టాత్మకంగా:పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా బ్రో. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఇందులో ముద్దుగుమ్మలు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సీనియర్ నటి రోహిణి, బ్రహ్మానందం, పృథ్వీ రాజ్ నటించారు.

బ్రో బిజినెస్:'బ్రో సినిమాకు మంచి బిజినెసే జరిగింది. నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల మార్కేట్ చేసుకుంది. అలాగే కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు కాగా.. ప్రపంచ వ్యాప్తంగా బ్రో సినిమాకు రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.

10వ రోజు: మెగా మల్టీ స్టారర్ బ్రో చిత్రానికి 10వ రోజు నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలిపి రూ. 1.36 కోట్ల షేర్, రూ. 2.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే సండే రోజు ఒక్కసారిగా భారీగా వసూళ్లు పెరిగాయి.

10 రోజుల్లో: బ్రో మూవీ 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 20.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.82 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.79 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.34 కోట్లు, గుంటూరులో రూ. 4.49 కోట్లు, కృష్ణాలో రూ. 3.44 కోట్లు, నెల్లూరులో రూ. 1.73 కోట్లతో కలుపుకుని మొత్తంగా రూ. 53.04 కోట్లు షేర్, రూ. 83.60 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

వరల్డ్ వైడ్ వసూళ్లు ఇలా: బ్రో సినిమాకు 10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 53.04 కోట్లు రాగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.08 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇవన్నీ కలిపితే 10 రోజుల్లో బ్రో సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 66.17 కోట్లు షేర్, రూ. 110.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అంటే భారీ వసూళ్లతో రూ. 200 కోట్ల క్లబ్ లో త్వరలో జాయిన్ కానుంది.
హిట్ కష్టమే బ్రో!: బ్రో చిత్రానికి రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే ఇప్పటికీ అంటే 10 రోజులకు రూ. 66.17 కోట్లు వచ్చాయి. ఇంకా రూ. 32.33 కోట్లు రాబట్టగలిగితేనే బ్రో క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. సండే రోజు కావడంతో వసూళ్లు భారీగా పెరిగినప్పటికీ వర్కింగ్ డేస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోడానికి ఏమాత్రం సరిపోవు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు విడుదలైతే మరింతగా కష్టంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











