Bro 4 Days Collections: భారీగా పడిపోయిన వసూళ్లు.. వచ్చింది ఇంతే.. హిట్ కష్టమే బ్రో!

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో అందరి దృష్టి తెచ్చుకున్న సినిమాల్లో బ్రో (BRO Movie)ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ ను సముద్ర ఖని తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్ అంటూ గోల చేస్తున్నారు. అలాగే కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు సాధిస్తున్న బ్రో సినిమాకు 4వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయనే అధికారిక లెక్కలు చూస్తే..

మరొక డైరెక్టర్:ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్లు ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే వంటి బాధ్యతలను చేపడుతున్నారు. అలా మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించిన పవన్ కల్యాణ్ సినిమా బ్రో. జూలై 28న చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అలాగే తమన్ ఎస్ మ్యూజిక్ అందించాడు.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 4 Days Worldwide Official Box Office Collections

బ్రో బిజినెస్:'బ్రో చిత్రానికి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లు కాగా.. ప్రపంచ వ్యాప్తంగా బ్రో సినిమాకు రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.

4వ రోజు వసూళ్లు:ఎన్నో అంచనాలతో విడుదలైన పవన్ బ్రో సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. నైజాంలో రూ. 99 లక్షలు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 18 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ. 2.36 కోట్లు షేర్, రూ. 4.05 కోట్లు గ్రాస్ వచ్చింది. అంటే గత 3 రోజులతో పోలిస్తే 4వ రోజు వసూళ్లు భారీగా తగ్గిపోయాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 4 Days Worldwide Official Box Office Collections

4 రోజుల్లో:బ్రో మూవీకి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాలు అయినా నైజాంలో రూ. 18.44 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.07 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.08 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.84 కోట్లు, గుంటూరులో రూ. 4.13 కోట్లు, కృష్ణాలో రూ. 2.93 కోట్లు, నెల్లూరులో రూ. 1.47 కోట్లతో కలిపుకుని టోటల్ గా రూ. 46.92 కోట్లు షేర్, రూ. 73.55 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 4 Days Worldwide Official Box Office Collections

వరల్డ్ వైడ్ గా:బ్రో సినిమాకు 4 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 46.92 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా బాగానే వసూలు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 4 రోజుల్లో రూ. 5.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.15 కోట్లు వసూలు చేసింది. ఇవన్నీ కలిపితే 4 రోజుల్లో బ్రో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.22 కోట్లు షేర్‌, రూ. 97.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 4 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ కొడుతుందా?:మెసేజ్ ఒరియెంటెడ్ గా వచ్చిన బ్రో సినిమాకు రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే ఈ సినిమాకు 4 రోజుల్లో దీనికి రూ. 58.22 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 40.28 కోట్లు రాబడితేనే బ్రో సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌ వస్తుంది. అయితే వీకెండ్ లో జోరు చూపించిన బ్రో వర్కింగ్ డేలోకి వచ్చేసరికి చతికిలపడిపోయింది. 4వ రోజు ఒక్కసారిగా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఇలాగే కంటిన్యూ అయితే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవడం కష్టంగా మారే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X