Bro 8 Days Collections: బ్రోకు దెబ్బ మీద దెబ్బ.. 8వ రోజు భారీగా పడిపోయిన వసూళ్లు
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో అందరి దృష్టి తెచ్చుకున్న సినిమాల్లో బేబి (Baby Movie)తోపాటు బ్రో (BRO Movie)ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ మెగా మల్టీ స్టారర్ చిత్రాన్ని సముద్ర ఖని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ లా ఉన్నా కామన్ ఆడియెన్స్ కు మాత్రం అంతగా రుచించలేదు. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. రోజురోజుకూ తగ్గుతూ వస్తున్న బ్రో 8వ రోజు కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

సుకుమార్ తరహాలో: ఈ మధ్య కాలంలో అగ్ర దర్శకులు ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే వంటి బాధ్యతలను చేపడుతున్నారు. విరూపాక్షకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా.. మాటల మాంత్రికుడు బ్రో సినిమాకు స్క్రీన్ ప్లేతోపాటు సంభాషణలు అందించారు. ఇక జూలై 28న చాలా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అలాగే తమన్ ఎస్ మ్యూజిక్ అందించాడు.

బ్రో మూవీ బిజినెస్: 'బ్రో సినిమాకు మంచి మార్కెట్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని కలిపి రూ. 37.30 కోట్ల బిజినెస్ అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ కాగా.. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా బ్రో సినిమాకు రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది.

8వ రోజు వసూళ్లు: పవన్-సాయి తేజ్ బ్రో చిత్రానికి 8వ రోజు అయిన శుక్రవారం నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్ష కలెక్షన్స్ వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు రూ. 30 లక్షల షేర్, రూ. 60 లక్షల గ్రాస్ నమోదు అయింది.

8 రోజుల్లో: బ్రో మూవీకి 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాలు అయినా నైజాంలో రూ. 19.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.59 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.63 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.22 కోట్లు, గుంటూరులో రూ. 4.35 కోట్లు, కృష్ణాలో రూ. 3.21 కోట్లు, నెల్లూరులో రూ. 1.62 కోట్లతో కలుపుకుని మొత్తంగా రూ. 51.01 కోట్లు షేర్, రూ. 80.35 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా: బ్రో సినిమాకు 8 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 51.01 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా పర్వాలేదనిపించుకుంది. ఈ క్రమంలోనే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 8 రోజుల్లో రూ. 5.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లు వసూలు చేసింది. ఇవన్నీ కలిపితే 8 రోజుల్లో బ్రో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.62 కోట్లు షేర్, రూ. 106.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

దెబ్బ మీద దెబ్బ: బ్రో సినిమాకు రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికీ రూ. 63.62 కోట్లు వచ్చాయి. అంటే బ్రో క్లీన్ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా రూ. 34.88 కోట్లు రాబట్టాల్సి ఉంది. మొదట్లో వసూళ్లు బాగానే ఉన్నా తర్వాత తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బ్రోకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.


Click it and Unblock the Notifications











