Bro 9 Days Collections: ఊపందుకున్న బ్రో వసూళ్లు.. కలిసొచ్చిన వీకెండ్.. హిట్ రావాలంటే?

సాధారణంగా సినిమాలు ఆడియెన్స్ టాక్ తో అయితే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతాయి. లేదా ప్లాప్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే పవన్ కల్యాణ్ బ్రో (Bro The Avatar). సినిమా మాత్రం ఇటీవల వివాదలతో హాట్ టాపిక్ గా మారింది.

దానికి కారణం బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర డ్యాన్స్ వీడియోనే. శ్యాంబాబు పాత్ర ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందంటూ కాంట్రవర్సీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇలా వివాదల నడుమ బ్రో సినిమాకు 9 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే లెక్కల్లోకి వెళితే..

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

కేతిక అలా-ప్రియా ఇలా: మెగా హీరోలు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా చేసిన మల్టీ స్టారర్ సినిమా బ్రో. ఇందులో ముద్దుగుమ్మ కేతిక శర్మ హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

బిజినెస్-థియేటర్స్: మరణం, కాలం వంటి మెసేజ్ కాన్సెప్టుతో రూపొందించిన 'బ్రో' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమాను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సుమారుగా 1000 స్క్రీన్లలో జూలై 28న విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1600 థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ 9 రోజులకు వచ్చేసరికి థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు సమాచారం.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

9వ రోజు: మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా యాక్ట్ చేసిన మెగా మల్టీ స్టారర్ మూవీ బ్రోకు 9వ రోజు నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలు రాగా.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 67 లక్షల షేర్, రూ. 1.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

తెలుగులో 9 రోజులకు కలిపి: బ్రో సినిమాకు 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 20.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.61 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.26 కోట్లు, గుంటూరులో రూ. 4.39 కోట్లు, కృష్ణాలో రూ. 3.29 కోట్లు, నెల్లూరులో రూ. 1.65 కోట్లతో కలుపుకుని మొత్తంగా రూ. 51.68 కోట్లు షేర్, రూ. 81.45 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

ప్రపంచవ్యాప్తంగా: బ్రో సినిమాకు 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 51.68 కోట్లు రాగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.84 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.98 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇవన్నీ కలిపితే 9 రోజుల్లో బ్రో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 64.50 కోట్లు షేర్‌, రూ. 108.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie 9 Days Worldwide Official Box Office Collections

పెరిగిన వసూళ్లు: పవన్ రేంజ్ కు తగినట్టుగా బ్రో సినిమాకు రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ కాగా 9 రోజులకు వరల్డ్ వైడ్ గా రూ. 64.50 కోట్లు వచ్చాయి. అంటే బ్రో చిత్రం ఇంకా 34 కోట్లు రాబట్టగలిగితేనే క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది. కాగా వర్కింగ్ డేస్ లో భారీగా వసూళ్లు పడిపోగా వీకెండ్ అయిన శనివారం కాస్తా పెరిగాయి. కానీ, ఇవి పవన్ రేంజ్ కలెక్షన్స్ మాత్రం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X