Bro Day 3 collections: బ్రో కలెక్షన్ల జోరు.. ఇప్పటికీ వచ్చింది ఇంతే.. హిట్ కొట్టాలంటే?

ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవన్ కల్యాణ్ స్పీచులు, సినిమాలు, ఆయన కనిపిస్తే చాలు ఈలలు, గోలతో మారుమోగిపోతుంది. అలాంటి పవన్ కల్యాణ్ తాజాగా నటించిన సినిమా బ్రో. నటుడు, డైరెక్టర్ సముద్ర ఖని దర్శకత్వం వహించిన బ్రో సినిమా తొలి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బ్రో సినిమాకు 3వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే లెక్కలోకి వెళితే..

నటీనటులు:పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా.. రొమాంటిక్ బ్యూటి కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీనే బ్రో (Bro The Avatar). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఈ మూవీ జూలై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 3 Expected Collections Worldwide

బ్రో బిజినెస్:చావు తర్వాత జీవితం అనే కాన్సెప్టుతో తెరకెక్కిన 'బ్రో' సినిమాకు నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే.. కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలువుకుని ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపింది.

థియేటర్ కౌంట్:వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్ర పోషించిన బ్రో సినిమాను తెలంగాణలోని నైజాంలో 350 స్క్రీన్లు, సీడెడ్‌లో 250 స్క్రీన్లు, ఆంధ్రప్రదేశ్ లో 450 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఇతర రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో 600 థియేటర్లలో ప్రదర్శించారు. దీంతో మొత్తంగా బ్రో సినిమా 1600 థియేటర్లలో విడుదలైంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 3 Expected Collections Worldwide

3వ రోజు:మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన మల్టీ స్టారర్ చిత్రం బ్రోతో మెగా అభిమానులు తెగ పండుగ చేసుకుంటున్నారు. ఇందులో వింటేజ్ పవన్ చూసినట్లుగా చెబుతున్నారు. అలాంటి బ్రో సినిమాకు 3వ రోజు అయిన ఆదివారం నాడు రూ. 13.10 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

3 రోజుల్లో:వినోదయ సీతమ్ రీమేక్ అనుకున్న సముద్ర ఖనికి మాటల మాంత్రికుడు పూర్తిగా స్క్రిప్ట్ మార్చిన సినిమానే బ్రో. దీనికి మొదటగా చిరంజీవి, కాలపురుషుడు అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ బ్రోగా ఫైనలైజ్ చేశారు. జూలై 28న రిలీజైన ఈ సినిమాకు వసూళ్ల పరంపర కొనసాగుతోంది. ఫలితంగా బ్రోకు 3 రోజుల్లో రూ. 60.10 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 3 Expected Collections Worldwide

హిట్ కావాలంటే?:పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్ సినిమాకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 42.33 కోట్ల షేర్, రూ. 69.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే మూడో రోజున ఉదయం 52.68 శాతం, మధ్యాహ్నం 73.74 శాతం, సాయంత్రం 78.64 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక సినిమా హిట్ కావాలంటే రూ. 50 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X