Bro Day 4 collections: ఢమాల్ అన్న 'బ్రో' కలెక్షన్స్.. మండే ప్రభావంతో వచ్చింది అన్ని కోట్లే!
మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన మల్టీ స్టారర్ సినిమా బ్రో. వినోదయ సీతం అనే తమిళ సినిమాకు స్క్రిప్ట్ తోపాటు పలు మార్పులతో ఆవిష్కరించిన బ్రో మూవీకి సముద్ర ఖని దర్శకత్వం వహించారు.
భారీ అంచనాలతో జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్ రేంజ్ మార్క్ రావట్లేదని మరో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బ్రో ది అవతార్ సినిమాకు 4వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలపై లుక్కేస్తే..

ప్రేయసి-చెల్లెలు: మెగా కుటుంబం నుంచి ఇద్దరు మల్టీ స్టారర్ గా వచ్చిన సినిమాగా బ్రో రికార్డ్ కొట్టింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా రొమాంటిక్ బ్యూటి కేతికా శర్మ, చెల్లెలుగా వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. బ్రో సినిమాకు బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్: టైమ్ అనేది ఎంత విలువైందో చెప్పే ప్రయత్నం చేసిన సినిమా బ్రో. ఇక పవర్ స్టార్ రేంజ్ లో దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా రూ. 80.50 కోట్ల బిజినెస్ అయింది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

4వ రోజున: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్. సినిమాలో పవన్ కల్యాణ్ స్వాగ్స్, సెటైరికల్ పంచ్ లకు ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. కానీ నార్మల్ ఆడియెన్స్ కు మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. ఇలా మిశ్రమ స్పందనతో రన్ అవుతున్న బ్రోకు వర్కింగ్ డే అయిన 4వ రోజు 7 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

4 రోజులకు కలిపి: బ్రో సినిమాకు తొలి రోజు రూ. 30.05 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు, ఇక 4న రూ. 7 కోట్లు వచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇలా బ్రో సినిమాకు 4 రోజుల్లో రూ. 71 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం అందించాయి. అంటే నాలుగో రోజున భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.
థియేటర్ ఆక్యుపెన్సీ: బ్రో చిత్రానికి తెలుగులో నాలుగో రోజు అయిన సోమవారం నాడు ఉదయం 17.61 శాతం, మధ్యాహ్నాం 22.31 శాతం, సాయంత్రం 27.34 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 55.26 కోట్ల షేర్, రూ. 91.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది పవన్-సాయి తేజ్ బ్రో సినిమా.

షేర్ కలెక్షన్స్: బ్రో సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిపోయింది. నాలుగో రోజు అయిన సోమవారం నాడు ఆఫ్ లైన్, ఆన్ లైన్ టికెట్ల సేల్స్ లెక్కల ప్రకారం రూ. 4.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











