Bro Day 5 collections: ఏంటి బ్రో.. మరీ ఇంత దారణమైన కలెక్షన్లా? ఇలా అయితే కష్టమే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం సినిమాను తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా మార్పు చేసి... తీసిన చిత్రం బ్రో. ఇక ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించారు.
భారీ అంచనాలతో జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే పవర్ స్టార్ రేంజ్ మార్క్ రావట్లేదని మరో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బ్రో ది అవతార్ సినిమాకు 5వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలపై లుక్కేస్తే..

ప్రేయసి-చెల్లెలు: మెగా కుటుంబం నుంచి ఇద్దరు మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన సినిమా బ్రో. ఇంతకు ముందు ఆచార్య సినిమాలో చిరు, రామ్ చరణ్ నటించగా.. ఇప్పుడు తన మేనల్లుడితో కలిసి పవన్ సినిమా తీశాడు. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు ప్రేయసిగా రొమాంటిక్ బ్యూటి కేతికా శర్మ, చెల్లెలుగా వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. బ్రో సినిమాకు బీజీఎమ్ లతో అదరగొట్టే తమన్ మ్యూజిక్ అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్: టైమ్ అనేది ఎంత విలువైందో చెప్పే మంచి మెసేజ్ ఒరియెంటెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు పవర్ స్టార్ రేంజ్ లో దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకుని మొత్తంగా రూ. 80.50 కోట్ల బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఇక, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుందని లెక్కలు చెబుతున్నాయి.

5వ రోజున: బ్రో మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. ఇక పవన్ తనదైన శైలీలోనే స్వాగ్స్, సెటైరికల్ పంచ్ లు వేశాడు. ఇక పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమాతో ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ నార్మల్ ఆడియెన్స్ కు మాత్రం రొటీన్ చిత్రంగా కనిపిస్తుంది. ఇలా మిశ్రమ స్పందనతో రన్ అవుతున్న బ్రోకు వర్కింగ్ డే అయిన 5వ రోజు 3 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.

5 రోజులకు కలిపి: బ్రో సినిమాకు తొలి రోజు రూ. 30.05 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు, ఇక 4న రూ. 4.05 కోట్లు, 5వ రోజు 3 కోట్లు మాత్రమే వచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇలా బ్రో సినిమాకు 5 రోజుల్లో రూ. 70.85 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం అందించాయి. అంటే ఐదో రోజున భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.

థియేటర్ ఆక్యుపెన్సీ: బ్రో చిత్రానికి తెలుగులో నాలుగో రోజు అయిన సోమవారం నాడు ఉదయం 14.93% శాతం, మధ్యాహ్నాం 18.66% శాతం, సాయంత్రం 0% శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక 4 రోజుల్లో బ్రో సినిమా వరల్డ్ వైడ్ గా రూ.91.75 కోట్ల షేర్, రూ.79.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.

షేర్ కలెక్షన్స్: బ్రో సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఐదో రోజు అయిన మంగళవారం నాడు ఆఫ్ లైన్, ఆన్ లైన్ టికెట్ల సేల్స్ లెక్కల ప్రకారం రూ. 3 కోట్ల రేంజ్ లో నెట్ అందుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం కష్టమేనని ఈ కలెక్షన్లు చూస్తుంటే అర్థం అవుతుంది. రిలీజ్ అయి వారం కాకముందే బ్రో కలెక్షన్లు తగ్గిపోవడం ఏంటి బ్రో అని నెటిజన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











