Bro Day 6 collections: అతి తక్కువగా కలెక్షన్స్.. పవన్ ఊహించని రికార్డ్.. వరుసగా మూడోసారి!

సాధారణంగా సినిమాలు ఆడియెన్స్ టాక్ తో అయితే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతాయి. లేదా ప్లాప్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ గా నిలుస్తాయి. అయితే పవన్ కల్యాణ్ బ్రో సినిమా మాత్రం వివాదలతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర డ్యాన్స్ వీడియోనే. శ్యాంబాబు పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందంటూ సినిమా విడుదల నుంచి వివాదం కొనసాగుతోంది. ఇలాంటి కాంట్రవర్సీ నేపథ్యంలో బ్రో సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాలు చూస్తే..

మెగా హీరోలు: మెగా హీరోలు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ హీరోలుగా.. ముద్దుగుమ్మ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా బ్రో (Bro The Avatar). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఈ మూవీ జూలై 28న వరల్డ్ వైడ్ గా అట్టహాసంగా విడుదలైంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 6 Expected Collections Worldwide

బ్రో సినిమా బిజినెస్: మరణం, కాలం వంటి మెసేజ్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'బ్రో' సినిమాకు నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే.. కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 6 Expected Collections Worldwide

6వ రోజు: మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా యాక్ట్ చేసిన మెగా మల్టీ స్టారర్ మూవీ బ్రో అభిమానులకు ఆకట్టుకుంది. కానీ, కామన్ ఆడియెన్స్ కు మాత్రం అంతగా రుచించట్లేదు. అందుకే తొలి 3 రోజుల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేసిన బ్రో తర్వాత డీలా పడిపోయింది. అలా 6వ రోజు రూ. 2.50 కోట్లు నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే రాబట్టనుంది. ఇన్ని రోజుల్లో ఇదే తక్కువగా రికార్డ్ అయింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 6 Expected Collections Worldwide

6 రోజుల్లో: వినోదయ సీతమ్ సినిమాకు కాస్తా అటు ఇటుగా డైరెక్టర్ సముద్ర ఖని బ్రో సినిమాను తెరకెక్కించారు. దీనికి మాటల మాంత్రికుడు పూర్తిగా స్క్రిప్ట్ మార్చి సహాయసహకారం అందించారు. అయితే సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫలితంగా బ్రో సినిమాకు 6 రోజుల్లో రూ. 73.30 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 6 Expected Collections Worldwide

పవన్ రికార్డ్: పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్ మూవీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా రూ. 60.42 కోట్ల షేర్, రూ. 101.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా రూ. వంద కోట్ల క్లబ్ లో చేరడంతో పవన్ కల్యాణ్ సరికొత్త రికార్డ్ కొట్టాడు. పవన్ వరుసగా చేసిన 3 రీమేక్ సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. వకీల్ సాబ్ (పింక్) భీమ్లా నాయక్ (అయ్యప్పనుమ్ కోషీయమ్) సినిమాలు కూడా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X