Bro Day 7 collections: మరింత దిగజారిన బ్రో కలెక్షన్స్... కానీ ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. ఇక ఈ చిత్రం విడుదలైనప్పిటి నుంచి... వివాదాలతో నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణం ఈ సినిమాలోని శ్యాం బాబు పాత్ర డ్యాన్స్ వీడియో.. ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలీ ఉందంటూ.. వివాదం కొనసాగుతుంది. ఇక బ్రో కలెక్షన్స్ రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే...

మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో ది అవతార్. ఇక ఈ సినిమాలో ముద్దుగుమ్మ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ జూలై 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో థియేటర్లలో రిలీజ్ అయింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 7 Expected Collections Worldwide

బిజినెస్ : ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో రూ. 30 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.50 కోట్ల బిజినెస్ చేసుకుందని తెలుస్తోంది. అలాగే.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు బిజినెస్ జరిపిందని లెక్కలు చెబుతున్నాయి.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 7 Expected Collections Worldwide

ఆరురోజుల్లో: ఇక బ్రో సినిమా ఆరురోజుల్లో ఇండియా వైడ్ గా రాబట్టిన కలెక్షన్ల విషయానికి వస్తే... మొదటి రోజు రూ.30.05 కోట్లు వసూళ్లు చేయగా.. రెండో రోజు రూ.17.05కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.16.90కోట్లు రాబట్టగా... నాలుగో రోజు కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి. కేవలం రూ.3.85 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ఐదో రోజు కూడా కలెక్షన్లు తగ్గి.. కేవలం రూ.2.95కోట్లు వసూళ్లు చేసింది. ఆరవ రోజు కేవలం రూ.2.10లక్షలు రాబట్టింది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 7 Expected Collections Worldwide

ఏడవ రోజు: బ్రో సినిమా ఆరు రోజుల్లో ఇండియా వైడ్ కలెక్షన్లు కేవలం రూ.72 కోట్లు వసూలు చేయగా.. ఇక ఏడవ రోజు అయినా గురువారంనాడు ట్రెడ్ వర్గాల ప్రకారం కేవలం రూ.1.70కోట్లు మాత్రమే రాబట్టనుంది. ఇన్ని రోజుల్లో ఇదే తక్కువగా రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ చూసుకుంటే.. 7 రోజుల్లో కేవలం 72.90 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Day 7 Expected Collections Worldwide

ఆక్యూపెన్సీ, కలెక్షన్స్: ఇక బ్రో చిత్రానికి తెలుగులో ఏడో రోజు అయిన గురువారం నాడు ఉదయం 12.82% శాతం, మధ్యాహ్నాం 15.81% శాతం, సాయంత్రం 17.15% శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక 7 రోజుల్లో బ్రో సినిమా వరల్డ్ వైడ్ గా రూ.99.13 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా వ్యాప్తంగా రూ.72.9 కోట్ల నెట్ రాబట్టగా... గ్రాస్ రూ.85.63కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 13.5కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ఏడో రోజుతో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 100కోట్ల రూపాయల మార్కును దాటనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

లాభాల్లోకి రావాలంటే: బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 97.50 కోట్లు కాగా... ఇక ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే... ఇంకో రూ. 24.6 కోట్లు రాబట్టాలి. ఇక ఇప్పటికే బ్రో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. త్వరలో రజనీ కాంత్ జైలర్, చిరంజీవి భోళాశంకర్ రిలీజ్ కాబోతున్నాయి. ఈలోపే బ్రో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే... సినిమా గట్టెక్కనుంది. కానీ బ్రో మూవీ కలెక్షన్స్ రోజు రోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ సినిమా గట్టెక్కుతుందో లేదో చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X